AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Murder Case: బయటకొచ్చిన సంచలన విషయాలు.. శ్రద్ధా వాకర్‌ మర్డర్‌ తర్వాత ఆఫ్తాబ్‌ వలలో ఓ లేడీ డాక్టర్‌..

ఆఫ్తాబ్‌ ప్రవర్తన గురించి సంచలన విషయాలు బయటపెట్టింది లేడీ డాక్టర్‌. సైకియాట్రిస్ట్‌ అయిన తనకే దిమ్మదిరిగే షాకిచ్చాడంటూ పోలీసులకు వాంగ్మూలమిచ్చింది. ఇంతకీ ఆమె బయటపెట్టిన సీక్రెట్స్‌ ఏంటి?

Shraddha Murder Case: బయటకొచ్చిన సంచలన విషయాలు.. శ్రద్ధా వాకర్‌ మర్డర్‌ తర్వాత ఆఫ్తాబ్‌ వలలో ఓ లేడీ డాక్టర్‌..
Aftab Poonawala
Sanjay Kasula
|

Updated on: Dec 01, 2022 | 7:20 AM

Share

ఆఫ్తాబ్‌పై రోజుకో సెన్షేషనల్‌ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. శ్రద్ధా వాకర్‌ మర్డర్‌ తర్వాత ఓ లేడీ డాక్టర్‌ను ట్రాప్‌ చేసిన ఆఫ్తాబ్‌, ఆమెను బహుమతులతో ముంచెత్తాడు. ఆమెను తన ఫ్లాట్‌కి కూడా తీసుకెళ్లాడు. ఇవన్నీ ఆమే… స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకుంది. బాడీ స్ప్రేలు, ఫర్‌ఫ్యూమ్‌లు గిఫ్ట్‌లుగా ఇచ్చేవాడని తెలిపింది. తనతో చాలా నార్మల్‌గా బిహేవ్‌ చేసేవాడని, కానీ ఇంత క్రూరుడని ఊహించలేకపోయానంటోంది ఆ లేడీ డాక్టర్. కొన్ని నెలలపాటే తమ ఇద్దరి డేటింగ్‌ సాగిందని, అక్టోబర్‌ 12న ఓ ఫ్యాన్సీ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని వెల్లడించింది. ఆ రింగ్‌… శ్రద్ధా వాకర్‌దని, ఆమెను చంపేశాడనే విషయం.. పోలీసులకు చెప్పేవరకు తనకు తెలియదని వాంగ్మూలం ఇచ్చింది.

శ్రద్ధ మర్డర్‌ జరిగిందని చెబుతోన్న నెలలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆఫ్తాబ్‌ను కలిసినట్లు వెల్లడించింది. శ్రద్ధా వాకర్‌ మర్డర్‌తో తనకెలాంటి సంబంధం లేదని, వాళ్లిద్దరి మధ్య రిలేషన్‌ గురించి కూడా తనకు తెలియదని పోలీసులకు తెలిపింది ఆ లేడీ డాక్టర్‌. ఫ్రిడ్జ్‌లో శ్రద్ధా శరీర భాగాలు ఉన్న సంగతి కూడా తెలియదని వెల్లడించింది. ఆఫ్తాబ్‌ చేసిన ఘోరం గురించి తెలిశాక షాక్‌కి గురైనట్లు పోలీసులకు తెలిపింది.

అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ నేడు..

ఢిల్లీలోని శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాల్‌కు ఈరోజు నార్కో టెస్ట్ జరగనుంది. అంతకుముందు, అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష జరిగింది, అందులో అతను తన నేరాన్ని అంగీకరించాడు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, అఫ్తాబ్ వాంగ్మూలాలు మరియు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా, ఛతర్‌పూర్, గురుగ్రామ్ అడవులలో మళ్లీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడుతుంది. తద్వారా మృతదేహం ముక్కలు లేదా ఇతర ఆధారాలను పోలీసులు సేకరించనున్నారు.

నవంబర్ 29న, రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌సి)లో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నార్కో టెస్ట్ నిర్వహించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. పూనావాలా తరపు న్యాయవాది అబినాష్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 1, 5వ తేదీల్లో నిందితులను రోహిణిలోని ల్యాబొరేటరీకి తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతి కోరారని, దానిని కోర్టు అంగీకరించిందని తెలిపారు.

పాలిగ్రాఫ్ పరీక్షలో ఒప్పుకున్నాడు

పాలిగ్రాఫ్ పరీక్షలో అఫ్తాబ్ పూనావాలా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు బుధవారం వర్గాలు వెల్లడించాయి.  అనేక సెషన్ల తర్వాత మంగళవారం పాలిగ్రాఫ్ పరీక్ష ముగిసింది. శ్రద్ధా వాకర్‌ను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అనేక ప్రాంతాల్లో విసిరినట్లు నిందితుడు అంగీకరించాడు.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం