పాఠశాల భవనంపై నుంచి కిందపడి పదో తరగతి విద్యార్ధి మృతి.. టీచర్లే కొట్టి చంపారంటోన్న తండ్రి

పాఠశాల భవనం మీద నుంచి పడిపోయి పదో తరగతి విద్యార్ధి మృతి చెందాడు. కలకత్తాలోని కస్బర్‌లోని సిల్వర్‌ పాయింట్‌ ప్రైవేట్‌ పాఠశాలలో సోమవారం (సెప్టెంబర్ 4) ఈ సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోనే తమ కుమారుడిని కొట్టి చంపారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన..

పాఠశాల భవనంపై నుంచి కిందపడి పదో తరగతి విద్యార్ధి మృతి.. టీచర్లే కొట్టి చంపారంటోన్న తండ్రి
Class 10 Student Died

Updated on: Sep 05, 2023 | 8:38 PM

కోల్‌కతా, సెప్టెంబర్ 4: పాఠశాల భవనం మీద నుంచి పడిపోయి పదో తరగతి విద్యార్ధి మృతి చెందాడు. కలకత్తాలోని కస్బర్‌లోని సిల్వర్‌ పాయింట్‌ ప్రైవేట్‌ పాఠశాలలో సోమవారం (సెప్టెంబర్ 4) ఈ సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోనే తమ కుమారుడిని కొట్టి చంపారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..

స్బర్‌లోని సిల్వర్‌ పాయింట్‌ ప్రైవేట్‌ పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల 5వ అంతస్తు నుంచి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమన్యం విద్యార్ధిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధి అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఐతే విద్యార్థి ఎలా చనిపోయాడో ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. పలురకాల కారణాలతో పాఠశాల అధికారులు ఇప్పటికే తమ కుమారుడిపై ఆగ్రహంతో ఉన్నారని విద్యార్థి తండ్రి ఆరోపించారు.

విద్యార్థి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈరోజు నా కుమారుడు ఓ ప్రాజెక్ట్‌ సమర్పించాల్సి ఉంది. ఫీజు డబ్బులు ఇవ్వని కారణంగా ఉపాధ్యాయులు అందరి ముందు మందలించారు. ఫీజు కట్టలేదనే కారంణంతోపాటు మరో కారణంతో పాఠశాల అధికారులు నా కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో పాఠశాల ఫీజు తగ్గించాలని నేను అధికారులను కోరాను. మిగతా విద్యార్ధుల తల్లిదండ్రులను కలిసి అధికారులతో మాట్లాడాను. చివరకు తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి 33శాతం ఫీజు తగ్గించాలని పాఠశాల యాజమన్యం భావించింది. అయితే ఈ ఘటన తర్వాత పాఠశాల యాజమన్యం నన్ను బెదిరించారు. స్కూల్ అధికారులు నా కొడుకుకు హాని తలపెడతారని అప్పట్లోనే అనుకున్నాను. ఇప్పుడు వాళ్లంతా నా కొడుకును హించించి కొట్టి చంపారని కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీనిపై విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పాఠశాల అధికారులు దీనిపై పొంతన లేని సమాధానం చెబుతుండటంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.