Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee: త్వరలోనే మమతా బెనర్జీ అరెస్టు.. పశ్చిమ బంగ బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్.. అదే కారణమా..

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ చెప్పడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. డిసెంబరు..

Mamata Banerjee: త్వరలోనే మమతా బెనర్జీ అరెస్టు.. పశ్చిమ బంగ బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్.. అదే కారణమా..
Mamata Banerjee
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 28, 2022 | 1:56 PM

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ చెప్పడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. డిసెంబరు నాటికి మమతా బెనర్జీ అరెస్ట్ కావచ్చని వివరించారు. ఈ జాబితాలో టీఎంసీ కి చెందిన 41 మంది పేర్లు ఉన్నాయన్నారు. అంతే కాకుండా మమతా అరెస్టుతో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి కూడా టీఎంసీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్టు ప్రకటించారు. టీఎంసీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలతో తాము టచ్‌లో ఉన్నామని, అభిప్రాయానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మమతా బెనర్జీ పితృ పక్షంలో పూజను ప్రారంభించి దుర్గాపూజ పవిత్రతను నాశనం చేస్తున్నారన్న సూకాంత.. ఆమె చేసిన పనులన్నీ తప్పని అందుకే దుర్గా దేవిని పూజించేటప్పుడు మంత్రం పఠించడంలో పొరపాటు జరిగిందని అన్నారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రాష్ట్రంలో వచ్చే ఆరు నెలలు కూడా ఉండదని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా.. మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా ఉపాధ్యక్షురాలు మౌసుమీ దాస్‌పై సెప్టెంబర్ 23న మాల్దాలోని మాలతీపూర్ ప్రాంతంలోని ఆమె నివాసంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాల్డా అధికార ప్రతినిధి షువోమోయ్ బసు ఈ ఆరోపణను ఖండించారు. పోలీసుల విచారణపై తమకు నమ్మకం ఉందని, దాడి జరిగితే దానికి గల కారణాన్ని తెలుసుకుంటామని ఆయన చెప్పారు. బెంగాల్ బీజేపీ నేతలు తరచూ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకరమైన మీమ్స్‌ పోస్టు చేసిన ఏడుగురు యూట్యూబర్లపై కోల్‌కతా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరిని అరెస్ట్ చేయగా, ఇతరులను పట్టుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ చేసిన ప్రసంగాల ఆధారంగా అభ్యంతరకరమైన మీమ్స్‌ను వీరు పోస్ట్ చేశారు. దీనిపై సాగర్‌ దాస్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..