DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా గిఫ్ట్.. నాలుగు శాతం డీఏ పెంపు..అంతేకాదు..

మోడీ సర్కార్ దసరా కానుకను ప్రకటించింది. డీఏను నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 34 శాతం ఉన్న డీఏను 4 శాతం పెంచడంతో అది 38 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఉన్న 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా గిఫ్ట్.. నాలుగు శాతం డీఏ పెంపు..అంతేకాదు..
Money
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 28, 2022 | 3:09 PM

పండుగలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ కానుకను ప్రకటించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్‌ను, డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఫ్రీ రేషన్ పథకం కాలపరిమితిని కూడా పొడిగించింది. మోదీ ప్రభుత్వం డీఏను నాలుగు శాతం పెంచడంతో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి జీతం 34 శాతం నుంచి 38 శాతానికి పెంచినట్లుగా సమాచారం. ఈ పెంపు జూలై నుంచి డిసెంబర్ 2022 వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుత డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతం కాగా, ఇప్పుడు 4 శాతం నుంచి 38 శాతానికి పెంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఉన్న 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఆమోదించబడిన ఫార్ములాపై ఆధారపడి ఉంటుంది.

1 జూలై 2022 నుండి DA పెంపు వర్తిస్తుంది. ప్రభుత్వం పెంచిన DA 2022 జూలై 1 నుంచి వర్తిస్తుంది. అంతకుముందు మార్చి 2022లో జనవరి నుంచి DA పెంచాలని  ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో కేంద్ర ఉద్యోగుల డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. ఇప్పుడు అది 38 శాతానికి పెరిగింది. దీని ప్రకారం ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతంలో రెండు నెలల డీఏ బకాయిలు అందుతాయి. దీనితో పాటు, సెప్టెంబర్ 28న డీఏ పెంపును క్లెయిమ్ చేసుకోవచ్చు 

ఈ ప్రాతిపదికన DA పెరుగుతుంది

లక్షలాది మంది ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను(డీఏ) పెంచడానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్- ఇండస్ట్రియల్ వర్కర్( ఏఐసీపీఐ-ఏడబ్ల్యూ )  ఇండెక్స్ డేటాను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. మొదటి ఆఫియర్లికి సంబంధించిన ఏఐసీపీఐ-ఏడబ్ల్యూ డేటా ఆధారంగా జూలైకి సంబంధించిన డీఏ ప్రకటించబడింది. జూన్‌లో సూచీ 129.2కి పెరగడంతో డీఏ 4 శాతానికి పెంపునకు మార్గం సుగమమైంది.

బేసిక్ జీతం ఎంత వరకు

ఇదిలావుంటే.. బేసిక్ జీతంపై ఈ పెరిగిన జీతం ఉంటుంది. పెరిగిన 4 శాతం డీఏ పెంపు జూలై 1 నుంచి వర్తిస్తుంది. నవరాత్రుల శుభదినాలలో ప్రభుత్వం తరపున చెల్లించడం ద్వారా ఉద్యోగులు ఎంతో ప్రయోజనం పొందుతారు. డీఏ 38 శాతం ఉండటంతో జీతంలో మంచి జంప్ ఉంటుంది. 4 శాతం డీఏతో కనీస, గరిష్ట బేసిక్ జీతం ఎంత పెరుగుతుందో ఓ సారి చూద్దాం..?

గరిష్ట బేసిక్ జీతంపై లెక్కింపు

  1. ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ . 56,900                  రూ. 56,900
  2. కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (38%)                           రూ. 21,622/నెలకు
  3. డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (34%)            రూ. 19,346/నెలకు
  4. డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరిగింది                    రూ. 21,622-19,346 = రూ 2260/నెలకు
  5. వార్షిక జీతం పెరుగుదల                                              రూ. 2260 X12 = రూ. 27,120

కనీస ప్రాథమిక జీతంపై గణన

  1. ఉద్యోగి ప్రాథమిక వేతనం                                           రూ.18,000
  2. కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (38%)                            రూ.6840/నెలకు
  3. డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (34%)            రూ.6120/నెలకు
  4. డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరిగింది                   రూ. 6840-6120 = రూ.1080/నెలకు
  5. వార్షిక వేతనం 720X12 =                                           రూ. 8640 పెంపు

మరిన్ని జాతీయ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!