అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్షల రిపోర్టులు చూసి డాక్టర్లు విస్మయం.. పొట్టలో 63 స్పూన్లు
డ్రగ్స్‌కు అడిక్ట్ అయిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అతడికి టెస్టులు చేసిన డాక్టర్లు.. రిపోర్టులు చూసి కంగుతిన్నారు.
మీరు గమనించారా..? ఈ మధ్య కాలంలో డాక్టర్లు ఆపరేషన్లు నిర్వహించి కడుపు నుంచి జుట్టు, స్పూన్లు, బోల్టులు, నట్లు, గ్లాసులు వంటివి బయటకు తీసిన ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఇందుకు మానసిక రుగ్మతలే కారణమని తెలుస్తుంది. అలాంటి ఇన్సిడెంట్ తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కడుపు నుంచి 65 స్పూన్లు బయటకు తీశారు డాక్టర్లు. ప్రజంట్ అతడి సిట్యువేషన్ సీరియస్‌గానే ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి మోనిటరింగ్ చేస్తున్నారు వైద్యులు. అయితే అతడి కడుపులోకి అన్ని స్పూన్లు ఎలా వెళ్లాయనేది ప్రశ్నార్థకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్ మన్సూరాపూర్ పీఎస్ పరిధిలోని బోపాడా గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి డ్రగ్స్‌కు బాగా అడిక్ట్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని సాధారణ మనిషిని చేయలేకపోయారు. దీంతో అతడిని షామ్లీలోని డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేశారు. అక్కడ దాదాపు నెలన్నర పాటు విజయ్‌కి చికిత్స అందించారు. అక్కడ ఉండగానే విజయ్‌కి ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది.
దీంతో హుటాహుటిన అతడిని ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. విజయ్‌కు టెస్టులు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు. అతడి కడుపులో భారీ సంఖ్యలో స్పూన్లు ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి.. బాధితుడి కడుపు నుంచి ఏకంగా 63 స్పూన్లు వెలికితీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త సీరియస్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ స్పూన్లు అతని కడుపులోకి ఎలా వచ్చాయని డాక్టర్లు వివరాలు సేకరిస్తున్నారు. విజయ్ ఈ విషయంపై స్పందించడం లేదు. డ్రగ్ డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ సిబ్బందే విజయ్‌కి బలవంతంగా స్పూన్లు తినిపించారని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.
UP | 62 spoons have been taken out from the stomach of 32-year-old patient, Vijay in Muzaffarnagar. We asked him if he ate those spoons & he agreed. Operation lasted for around 2 hours, he is currently in ICU. Patient has been eating spoons for 1 year: Dr Rakesh Khurrana (27.09) pic.twitter.com/tmqnfWJ2lY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022
అయితే మెంటల్ ప్రాబ్లమ్స్ వల్లే బాధితులు స్పూన్లు, జుట్టు, బోల్టులు, టాయ్స్ వంటివి మింగుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని.. మానసికపరమైన సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి అనంతరం ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..