Dogs Training: నమీబియా చీతాలకు శునకాలతో భద్రత.. జర్మన్‌ షెఫర్డ్‌ డాగ్స్‌కు ఎలా శిక్షణ ఇస్తున్నారో చూడండి..

ప్రధాని నరేంద్రం మోదీ పుట్టిన సందర్భంగా సెప్టెంబర్‌ 17న మధ్యప్రదేశ్‌లోని కునో– పాల్‌పూర్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి చీతాలను విడుదల చేశారు. నరేంద్ర మోదీ స్వయంగా చీతాలను అడవిలోకి వదిలిన విషయం తెలిసిందే..

Dogs Training: నమీబియా చీతాలకు శునకాలతో భద్రత.. జర్మన్‌ షెఫర్డ్‌ డాగ్స్‌కు ఎలా శిక్షణ ఇస్తున్నారో చూడండి..
German Shepherd Protecting
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 28, 2022 | 3:52 PM

భారత దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి వృద్ధి చేయడమే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నమీబియా దేశం నుంచి చీతాలను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం నమీబియాతో గతంలోనే ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే ఏడు దశాబ్ధాల తర్వాత చీతాలు భారత్‌లో సందడి చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రం మోదీ పుట్టిన సందర్భంగా సెప్టెంబర్‌ 17న మధ్యప్రదేశ్‌లోని కునో– పాల్‌పూర్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి చీతాలను విడుదల చేశారు. నరేంద్ర మోదీ స్వయంగా చీతాలను అడవిలోకి వదిలారు. వీటిలో రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలను ఉన్నాయి. వీటిని ప్రత్యేకంగా రూపొందించిన బీ747 జంబో జెట్‌లో భారత్‌కు తీసుకొచ్చారు.

చీతాలయితే భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి. మరి వాటి రక్షణ విషయం ఏంటి. ఈ విషయంపై కూడా భారత ప్రభుత్వ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసుకొచ్చిన అతిథులను సంరక్షించేందుకు అదే స్థాయిలో చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కునో పార్కుకు 5 కి.మీలో పరిధిలో ఉన్న గ్రామాల్లో వెయ్యికిపైగా శునకాలకు రేబిస్‌ వ్యాక్సిన్‌ వేశారు. దీనికి కారణం.. చీతాలు వేటాడిన ఆహారాన్ని కొంత తిని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. తిరిగి అనంతరం మళ్లీ మిగిలిన భాగాన్ని తింటాయి. ఈ మధ్యలో ఏదైనా రేబిస్‌ సోకిన శునకం సదరు ఆహారాన్ని తింటే, చీతాలకు కూడా రేబిస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. ఇందుకే శునకాలన్నింటికీ రేబిస్‌ టీకా ఇప్పించారు.

ఇవి కూడా చదవండి

శునకాలతో భద్రత..

శునకాలతో రేబిస్‌ రాకుండా చూసుకున్న అధికారులు. ఇప్పుడు శునకాలతోనే వాటికి భద్రత కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే జర్మన్‌ షెఫర్డ్‌ జాతి శునకాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. పంచుకులో ఉన్న ఇండోటిబెట్‌ బోర్డర్‌ పోలీస్‌ ఆధ్వరంలో ఉండే నేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఫర్‌ డాగ్స్‌లో ఈ శునకాలకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ముగిసిన అనంతరం ఈ జాగిలాలను చీతాలకు భద్రత కల్పించేందుకు మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌కు తరలిస్తారు. వేటగాళ్ల నుంచి పులులను ఇవి కాపాడుతాయి. ఈ శునకాలకు పులుల చర్మం, ఎముకలను గుర్తించే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శునకాల శిక్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. శిక్షకుల కమాండ్స్‌కు ఆధారంగా అవి స్పందిస్తున్న తీరు ఔరా అనిపించేలా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..