ఆస్పత్రిలో కమిషనర్‌ ఆకస్మీక తనిఖీలు.. ఆ చిన్నారి దుస్థితి చూసి బోరున ఏడ్చేసిన మహిళా అధికారి..

ఆమె కళ్లలో నుండి కన్నీళ్లు ఉప్పొంగాయి. నాలుక తడి ఆరిపోయింది.. గొంతు మూగబోయింది. జిల్లా ఆసుపత్రిలో చేరిన చిన్నారి పరిస్థితిని చూసి కమీషనర్‌ తట్టుకోలేక బోరు ఏడ్చేసింది. 

ఆస్పత్రిలో కమిషనర్‌ ఆకస్మీక తనిఖీలు.. ఆ చిన్నారి దుస్థితి చూసి బోరున ఏడ్చేసిన మహిళా అధికారి..
Commissioner Roshan Jacob
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 28, 2022 | 4:53 PM

పదేళ్ల చిన్నారి పరిస్థితి చూసి కమీషనర్‌ కన్నీరుమున్నీరుగా విలపించిన ఘటన అందరినీ కదిలించింది. ఆస్పత్రిలో చేరిన చిన్నారిని చూసిన మహిళా కమిషనర్ గొంతు మూగబోయింది. బాలుడి పరిస్థితి చూసి చలించిపోయిన ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. డివిజన్ కమిషనర్ రోషన్ జాకబ్ ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం, అధికారులను మందలించడం వంటి వార్తలు అనేకం చూశాం. కాని బుధవారం రోజున ఆమెకు సంబంధించిన మరో కొత్త రూపం కనిపించింది. IAS లఖింపూర్ ఖేరీకి చేరుకోగానే ఏడ్చేసింది. ఆమె కళ్లలో నుండి కన్నీళ్లు ఉప్పొంగాయి. నాలుక తడి ఆరిపోయింది.. గొంతు మూగబోయింది. జిల్లా ఆసుపత్రిలో చేరిన చిన్నారిని చూసి కమీషనర్‌ తట్టుకోలేక బోరు ఏడ్చేసింది.  ప్రమాదంలో గాయపడిన చిన్నారి పరిస్థితి కమీషనర్ గుండెల్లో గుబులు పుట్టించింది. కమీషనర్ ముందు తన తల్లి ముకుళిత హస్తాలతో కుమారుడి ప్రాణం కోసం వేడుకుంటే.. కమీషనర్ కూడా కన్నీరుమున్నీరుగా విలపించారు.

బుధవారం లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న లఖింపూర్‌ చేరుకున్న లక్నో డివిజన్‌​కమిషనర్‌ రోషన్‌ జాకబ్‌ జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల కుటుంబాలతో ఆమె మాట్లాడారు. అనంతరం ఆమె వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఇంతలో ఒక యువకుడు అతనిని ఆసుపత్రిలో కలిశాడు. అతను తన రోగికి సరైన చికిత్స అందించడం లేదని కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.

కమీషనర్ ఆమెతో పాటు వార్డుకు వెళ్లారు. అక్కడ ఒక 10 ఏళ్ల చిన్నారి మంచంపై రోగిలాగా పడుకుని ఉండటం చూసింది. వాస్తవానికి, రెండు రోజుల క్రితం సదర్ కొత్వాలి ప్రాంతంలోని బాజ్‌పాయ్ గ్రామంలో గోడ కూలి, ముగ్గురు పిల్లలు మరణించారు. అదే ప్రమాదంలో కఫీల్ అనే చిన్నారి కూడా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత కఫీల్ తీవ్ర అవస్థ పడుతున్నాడు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ – పిల్లల చికిత్సలో నిర్లక్ష్యం వహించవద్దని వైద్యులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..