ఓరీ దేవుడో ఇదేం చాయ్‌రా బాబు… ఆగ్రహంతో ఊగిపోతున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఇక జీవితంలో టీ ముట్టరు

మీరు అల్లం, యాలకులు, మసాలా టీ ఎక్కువగా తాగే ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్‌తో తయారు చేసిన టీని తాగారా..? తాగకపోతే, గనుక ఇప్పుడు ట్రై చేసి చూడండి..

ఓరీ దేవుడో ఇదేం చాయ్‌రా బాబు... ఆగ్రహంతో  ఊగిపోతున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఇక జీవితంలో టీ ముట్టరు
Dragon Fruit Tea
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 28, 2022 | 4:48 PM

చాలా మందికి తెల్లవారి నిద్రలేవగానే కప్పు కాఫీనో, టీనో తాగందే ఏ పని సాగదు. ఇంకొందరైతే బెడ్‌ కాఫీ, టీ అని తాగుతుంటారు. అలా రోజును ప్రారంభించబోతున్నా, మధ్యాహ్నం పని సమయాలకు మధ్యలో కప్పు టీ తప్పనిసరిగా తాగేస్తుంటారు. చాయ్ అనేది మనస్సును శక్తివంతం చేసే రిఫ్రెష్ పానీయం. అలాంటి చాయ్‌లో అనేక రకాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. టీకి సంబంధించి ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. కొందరు రూహ్ అఫ్జాతో టీ తయారు చేస్తుంటే, మరికొందరు అరటిపండు, చీకూతో టీ తయారు చేసి ప్రజలకు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు టీతో జరిగిన ఓ దారుణాన్ని నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల ఆగ్రహం ఆకాశానికి చేరింది. నిజానికి, ఒక చాయ్‌వాలా సోదరుడు డ్రాగన్ ఫ్రూట్ నుండి టీ తయారు చేసాడు. వీడియో రెసిపీని చూసిన నెటిజన్లు కోపంతో మండిపోతున్నారు. అందులో కాస్త విషం పెట్టండ్రా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

మీరు అల్లం, యాలకులు, మసాలా టీ ఎక్కువగా తాగే ఉంటారు. అయితే, మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్‌తో తయారు చేసిన టీని తాగారా..? మీరు తాగకపోతే, గనుక ఇప్పుడు ఇక్కడ ఆ కొత్త రకం టీని ఎలా తయారు చేస్తారో చూడండి. వైరల్ అవుతున్న వీడియోలో ఒక చాయ్‌ విక్రయించే వ్యక్తి ఒక కప్పులో వేడి టీ పోస్తున్నాడు. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ గుజ్జును తీసి దానిని ఒక కప్పు టీలో కలుపుతాడు. తర్వాత ఒక చెంచా కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి బాగా కలిపి ప్రజలకు అందించాడు. ఈ వీడియో బంగ్లాదేశ్ నుండి షేర్‌ చేయబడినదిగా చెబుతున్నారు. అయితే టీ రిసిపిని చూసిన తర్వాత జనాల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడా మీ తల పట్టుకుంటారు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌లో ఓ వ్యక్తి డ్రాగన్ ఫ్రూట్ చాయ్ విక్రయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో Instagram హ్యాండిల్ ది గ్రేట్ ఇండియన్ ఫుడీలో షేర్ చేయబడింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ వీడియోలకు అంకితం చేయబడింది. ఇప్పుడు, ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించిన ఈ వీడియోలో ఆ వ్యక్తి డ్రాగన్ ఫ్రూట్ పల్ప్‌తో పాల టీని తయారు చేస్తుండటం నెటిజన్లు అవాక్కయ్యేలా చేసింది. టీ తయారీ దారుని, షేర్‌ చేసిన వ్యక్తిని తింటకుండా ఉండలేరు. సహజంగానే ఐకానిక్ ఫుడ్ ఐటమ్స్‌తో గందరగోళాన్ని ఎవరూ సహించరు. అందుకూ నెటిజన్లు సైతం తీవ్రమైన కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి