AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలికి అలా అడ్డంగా దొరికిపోయాడు.. జుట్టు పట్టుకొని మరీ చితక్కొట్టింది.. పాపం అబ్బాయి..

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రియుడు, ప్రియురాలికి సంబంధించినదిగా భావిస్తున్నారు. వీడియో ఆధారంగా ప్రియురాలిని మోసం చేసిన ప్రియుడి పరిస్థితిని ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు.

ప్రియురాలికి అలా అడ్డంగా దొరికిపోయాడు.. జుట్టు పట్టుకొని మరీ చితక్కొట్టింది.. పాపం అబ్బాయి..
Lover Did Big Mistake
Jyothi Gadda
|

Updated on: Sep 28, 2022 | 3:50 PM

Share

సోషల్ మీడియా అనేది వివిధ రకాల ఆసక్తికరమైన వీడియోలతో నిండిన ప్రపంచం..ఇక్కడ ప్రతిరోజూ వేలకొద్దీ వీడియోలు వీక్షించబడతాయి. అప్‌లోడ్ చేయబడతాయి. ఇందులో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చిన వెంటనే వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలను సోషల్ మీడియా అభిమానులు ఇష్టపడుతున్నారు.షేర్‌ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రియుడు, ప్రియురాలికి సంబంధించినదిగా భావిస్తున్నారు. వీడియో ఆధారంగా ప్రియురాలిని మోసం చేసిన ప్రియుడి పరిస్థితిని ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. తనను మోసం చేసిన ప్రియుడికి ప్రియురాలు చెప్పిన గుణపాఠం అతడు తన జీవితాంతం మరిచిపోలేడనడంలో సందేహం లేదు.

ఈ వైరల్ వీడియోలో పాఠశాల వెలుపల కొందరు అమ్మాయిలతో ఓ అబ్బాయి మాట్లాడుతున్నట్లు మీరు చూడవచ్చు. ఈ సీన్‌ని అతడి ప్రియురాలు చూసింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూడాల్సిందే. తన ప్రియుడు మరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని తెలిసిన  ఆ ప్రియురాలు వెంటనే తన ప్రియుడి దగ్గరికి వచ్చింది.. అతన్ని జుట్టు పట్టుకోని చెడామడా వాయించేసింది. ప్రియురాలిని చూడగానే ప్రేమికుడి ముఖంలో వచ్చిన మార్పు చూడాలి పాపం..

ఇవి కూడా చదవండి

జుట్టు పట్టుకున్న ప్రియురాలి చేతి నుంచి తప్పించుకోవడానికి అతడు తెగ ప్రయత్నిస్తున్నాడు. ప్రేయసి అతడి జుట్టు పట్టుకుని చెంప మీద చాలాసార్లు కొట్టడానికి చేయి పైకెత్తింది. కానీ, కొట్టలేదు. చివరకు ప్రియురాలికి క్షమాపణ చెప్పి ప్రియుడు పరారయ్యాడు. ఏది ఏమైనప్పటికీ, వీడియో ముగింపు చాలా ఆసక్తికరంగా ఉంది.

View this post on Instagram

A post shared by Are Bhaai (@are_bhaai)

ఈ వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో are_bhaai యొక్క Instagram పేజీలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 93 k వీక్షణలు, అనేక లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి