Viral Video: నీకు రాసి పెట్టి గురూ..! వామ్మో జర్రయితే ప్రాణాలు పోయేవి.. చూస్తేనే వణుకుపుడుతోంది..
అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే గ్రామాలలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తుంటాయి.. భారీగా ఆస్తినష్టం సంభవించడంతోపాటు.. కొన్ని సందర్భాలలో ప్రజల ప్రాణాలు కూడా పోతుంటాయి.. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి.. తాజాగా.. ఓ ఏనుగు బారినుంచి ఓ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు..

అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే గ్రామాలలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తుంటాయి.. భారీగా ఆస్తినష్టం సంభవించడంతోపాటు.. కొన్ని సందర్భాలలో ప్రజల ప్రాణాలు కూడా పోతుంటాయి.. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి.. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు తరచూ జనవాసాల్లోకి వచ్చి బీభత్సం చేయడం లాంటి ఘటనలను సామాజిక మాధ్యమాల్లో ఎన్నో చూసుంటాం.. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలతో బయటపడిన సందర్భాలున్నాయి.. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగినప్పటికీ.. శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు.. ఎలిఫెంట్ టెర్రర్ బారినుంచి బయటపడేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అవి తాత్కాలికంగానే ఉంటున్నాయంటూ ఆయా ప్రాంతాల్లోని ప్రజలు పేర్కొంటున్నారు..
అయితే.. తాజాగా.. ఓ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఉగ్రరూపం దాల్చి.. వాహనాలపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. హోజైలో అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు గందరగోళం సృష్టించింది. సైక్లిస్ట్, టెంపోపై ఏనుగులు దాడికి ప్రయత్నించాయి.. అయితే.. ఓ ఏనుగు దాడి నుంచి సైకిల్ పై వస్తున్న వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు.. ఈ ఘటనను ఒకరు తన సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశారు..
వీడియో చూడండి..
రోడ్డు దాడుతున్న అడవి ఏనుగులు ఒక్కసారిగా వాహనాలపైకిదూసుకొచ్చాయి.. ఓ ఏనుగు సైక్లిస్ట్ లు ఇద్దరు, టెంపో టార్గెట్ గా దూసుకువచ్చింది.. ఆ సమయంలో టెంపో డ్రైవర్ వేగంగా ముందుకువచ్చాడు.. అయితే.. సైక్లిస్ట్ లు ఇద్దరు మాత్రం వెనుకనే ఉన్నారు. ఇంచుమించుగా ఓ సైక్లిస్ట్ దగ్గరికి ఏనుగు దూసుకు రాగా.. సైకిల్ తొక్కుతున్న వ్యక్తి.. స్పీడుగా తొక్కుతూ తృటిలో తప్పించుకున్నాడు..
దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. అయితే.. చివరకు ఓ వ్యక్తి.. ఏనుగులను నియంత్రించడానికి పటాకులు పేల్చడంతో అది వెనక్కుతగ్గింది.. అనంతరం చాలా ఏనుగులు రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..