Telugu News India News Vice President Venkaiah Naidu started Venkaiah Naidu bike rally by waving the flag at Red fort in Delhi Telugu National News
Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. హాజరైన కేంద్రమంత్రులు, ఎంపీలు
Har Ghar Tiranga Rally: దేశ రాజధాని ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) జెండా ఊపి ప్రారంభించారు. ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ తో సహా పలువురు కేంద్రమంత్రులు..
Har Ghar Tiranga Rally: అఖండ భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఈ ఆగస్టు 15తో 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. భారత స్వాతంత్ర్య సంగ్రామం, ఉద్యమ వీరుల స్ఫూర్తిని ఘనంగా చాటేలా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు, కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక మువ్వన్నెల జెండా గొప్పతనం అందరికీ తెలిసేలా ఇంటింటా మువ్వన్నెల జెండా అంటూ హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga ) క్యాంపెయిన్‌ని చేపడుతోంది. ఈనేపథ్యంలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) జెండా ఊపి ప్రారంభించారు. ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ తో సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Joined by Hon’ble Union Ministers & Member of Parliament colleagues participated in ‘Bike Rally’ from the historic Red Fort this morning as part of #HarGharTiranga campaign.
ర్యాలీకి ముందు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. మువ్వన్నెల జెండా స్ఫూర్తిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో అందరూ విస్తృతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులమంతా ఒక్కటే అనే భావనను ముందుకు తీసుకెళ్లాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందన్నారు. కాగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.