Viral Video: మన జాతీయ జెండాను ఎలా తయారు చేస్తున్నారో చూశారా.. సెల్యూట్ చేద్దాం..
Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర సాంస్కతిక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేశ భక్తిని చాటాలని ఆ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
Azadi Ka Amrit Mahotsav: దేశ వ్యాప్తంగా దేశ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15నాడు ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర సాంస్కతిక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేశ భక్తిని చాటాలని ఆ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా హర్ ఘర్ తిరంగా కోసం దేశ ప్రజలకు పంపిణీ చేసేందుకు భారీ సంఖ్యలో జాతీయ జెండాలను శరవేగంగా తయారుచేస్తున్నారు.
జాతీయ జెండాను తయారు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
దేశ ప్రజల ఐక్యతను,మన జాతీయతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పటానికి పీఎం శ్రీ @narendramodi గారు అందించిన ప్రోత్సాహంతో,కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న #HarGharTiranga కార్యక్రమానికి అవసరమైన మువ్వన్నెల జెండాలు చాలా వేగంగా సిద్ధమౌతున్నాయి!! pic.twitter.com/v894TNw6Dk
— G Kishan Reddy (@kishanreddybjp) August 2, 2022
మరిన్ని జాతీయ వార్తలు చదవండి