AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“షేర్ అండ్ కేర్”తో ముందుకెళ్దాం.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Independence Day 2021: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“షేర్ అండ్ కేర్”తో ముందుకెళ్దాం.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Venkaiah Naidu (file)
Balaraju Goud
|

Updated on: Aug 14, 2021 | 6:18 PM

Share

Vice President Venkaiah Naidu conveys Greetings: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్ల మైలురాయిని చేరుకుంటున్న ఈ తరుణంలో, దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సమరయోధుల స్ఫూర్తితో, వారి ధైర్యం, దేశభక్తిని ప్రేరణగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ సందర్భంలో దేశ పురోగతి, శ్రేయస్సు కోసం పాటుపడడం ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీరించాలని ఆయన కోరారు. దేశంలోని అన్ని స్థాయిల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిచడం, అన్నివర్గాలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందేలా చూడాలని పిలుపునిచ్చారు.

మనకున్న దాన్ని నలుగురితో పంచుకోవడం, నలుగురి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం, షేర్ అండ్ కేర్ వంటి భారతీయ విలువలను ఆదర్శంగా తీసుకుని మసలుకోవాలన్నారు. దేశ పౌరులందరికీ భద్రత, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే రాజ్యంగపరమైన ఆదర్శాన్ని సాధించేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని మన అంతర్గత శక్తులను తిరిగి ఆవిష్కరించుకునేందుకు, మన ప్రజల అపారమైన సామర్థ్యాన్ని గ్రహించేందుకు, వివిధ దేశాల సహకారంలో భారతదేశానికి సముచిత స్థానం సంపాదించుకునేందుకు అందరం పునరంకితమయ్యే దిశగా ప్రతిన బూనుదామన్నారు.

Read Also…  LIC: కస్టమర్లు అలర్ట్‌.. మీరు ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్నారా.? అయితే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి..!

Covid Vaccine: ఇక వారికి రెండు కాదు మూడు డోసులు.. కోవిడ్ టీకాపై అమెరికా కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా రేపు అన్నదాతల ‘తిరంగా ర్యాలీలు’.. నిరసన ప్రదర్శనలు..హర్యానాలో 5 వేల ట్రాక్టర్లతో ‘మార్చ్’