AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkaiah Naidu: సభ పవిత్రతను నీరుగార్చారు.. రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Parliament Protest: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో

Venkaiah Naidu: సభ పవిత్రతను నీరుగార్చారు.. రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
M Venkaiah Naidu
Shaik Madar Saheb
|

Updated on: Aug 11, 2021 | 1:22 PM

Share

Parliament Protest: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తనపై వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తంచేశారు. సభలో అలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్‌ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదని.. అలాంటి పార్లమెంట్‌లో కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవరించారని ఆవేదన వ్యక్తంచేశారు.

కొందరు టేబుళ్లపై కూర్చొగా.. మరికొందరు నిల్చున్నారన్నారు. సభలో పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనని వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదని.. చాలా దురదృష్టకరమైన పరిస్థితి అంటూ వ్యాఖ్యానించారు. స‌భ పవిత్రతను కాపాడ‌టంలో అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారని అసహనం వ్యక్తంచేశారు. మంగ‌ళ‌వారం స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను పూర్తిగా ప్రజలకు చూపించాలని పేర్కొన్నారు.

సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదంటూ వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కాగా.. రాజ్యసభలో మంగళవారం విపక్ష సభ్యులు రైతుల సమస్యను లేవనెత్తాయి. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా కొందరు సభ్యులు నల్లని వస్త్రాలతో.. పత్రాలు విసిరేస్తూ తమ నిరసనలు తెలిపారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.

Also Read:

Covid-19 second wave: ఆక్సిజన్‌ కొరతతో మరణించింది ఒక్కరే.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కోవిడ్ చలాన్లు జారీ చేస్తున్న అధికారులపై ఇద్దరు మహిళల దాడి.. జుట్టు పట్టుకుని..రచ్చ..రచ్చ