Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు అనుమతిపై పున:పరిశీలన.. వాయిదా వేసిన ప్రభుత్వం..

Uttarakhand government: దేశమంతటా కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. చార్‌ధామ్ యాత్రపై మరో కీలక

Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు అనుమతిపై పున:పరిశీలన.. వాయిదా వేసిన ప్రభుత్వం..
Chardham Yatra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 15, 2021 | 12:04 PM

Uttarakhand government: దేశమంతటా కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. చార్‌ధామ్ యాత్రపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మొదట రాష్ట్రంలోని మూడు జిల్లాల వారికే చార్‌ధామ్ యాత్రకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం.. మరలా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. కరోనా కర్ఫ్యూను జూన్ 22 వరకూ పెంచిన నేపథ్యంలో.. ఈ నిర్ణయంపై పున:సమీక్షించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి నిర్ణయం జూన్ 16 తర్వాత తీసుకోనున్నట్లు వెల్లడించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. చమోలీ, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల భక్తులు చార్‌ధామ్ యాత్ర దేవాలయాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి-యమునోత్రిలను దర్శించుకునేందుకు అనుమతించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి, కేబినెట్ మినిస్టర్ సుబోధ్ ఉనియాల్ సోమవారం వెల్లడించారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినవారిని దేవాలయాల సందర్శనకు అనుమతిస్తామని తెలిపారు. అయితే ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు మంగళవారం ఉదయం ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. చార్‌ధామ్ యాత్రపై నైనిటాల్ హైకోర్టు విచారణ జరుపుతోందని.. దీనిపై మళ్లీ సమీక్షించనున్నట్లు వెల్లడించింది.

అయితే.. ఉత్తరాఖండ్‌లో కోవిడ్-19 మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమలు చేస్తున్న కర్ఫ్యూను జూన్ 22 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

Also Read:

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్……ఆ నగరంలో మరో నెల పాటు ఆంక్షల పొడిగింపు….ప్రధాని బోరిస్ జాన్సన్

MK Stalin: సీఎం.. అయినా సాధారణ వ్యక్తిలా.. కాన్వాయ్ ఆపి వృద్ధురాలి పిటిషన్ స్వీకరించిన స్టాలిన్..