Uttarakhand Floods: మరో మూడు మృతదేహాలు వెలికితీత.. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..?

Uttarakhand Floods Updates: హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించగా.. 170..

Uttarakhand Floods: మరో మూడు మృతదేహాలు వెలికితీత.. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 16, 2021 | 4:46 AM

Uttarakhand Floods Updates: హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించగా.. 170 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని తపోవన్‌ టన్నెల్ నుంచి సోమవారం మరో 3 మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ జల ప్రళయంలో మృతిచెందిన వారిసంఖ్య 54కు పెరిగింది. ఈ నెల 7న వరదలు అతలాకుతలం చేసిన తర్వాత జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలోని తపోవన్-విష్ణుగడ్ ప్రాజెక్ట్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 9 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతమంతా బురద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. అయినప్పటికీ సిబ్బంది నిరంతరం గల్లంతైన వారి ఆచూకీ కోసం శ్రమిస్తున్నారు.

Also Read:

కేరళలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. ఎమ్మెల్యే కప్పన్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎన్సీపీ

Night curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూ.. మెట్రో నగరాల్లో నెలాఖరు వరకు పెంచిన గుజరాత్ ప్రభుత్వం.. ఎందుకంటే..?