AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: పాములు గత జన్మలో ఫ్రెండ్స్ అంటుంటున్న ఓ వ్యక్తి.. విష సర్పాలతో సైతం ఆడుకుంటూ..

Uttar Pradesh: సర్వసాధారణంగా ఎవరికైనా పాముని చూస్తే వెన్నెల్లో వణుకు వస్తుంది.. అది విషం ఉన్న పామైన, విషం లేని పామైనా సరే..వెంటనే అక్కడ నుంచి పరుగులు పెడతాం.. అయితే రేర్ గా కొంతమంది..

Uttar Pradesh: పాములు గత జన్మలో ఫ్రెండ్స్ అంటుంటున్న ఓ వ్యక్తి.. విష సర్పాలతో సైతం ఆడుకుంటూ..
Mohammad Plays With Snake
Surya Kala
|

Updated on: Apr 30, 2022 | 9:51 PM

Share

Uttar Pradesh: సర్వసాధారణంగా ఎవరికైనా పాముని చూస్తే వెన్నెల్లో వణుకు వస్తుంది.. అది విషం ఉన్న పామైన, విషం లేని పామైనా సరే..వెంటనే అక్కడ నుంచి పరుగులు పెడతాం.. అయితే రేర్ గా కొంతమంది ఎటువంటి పామైనా సరే తమకు పెంపుడు జంతువు అన్నట్లు ఫీల్ అవుతూ వాటితో ఆడుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు  మహమ్మద్ మన్నన్ ( mohammad mannan). ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇతను పాములను పెంపుడు జంతువుల్లా భావిస్తాడు. వాటిని ఇష్టపడుతూ.. ఆడుకుంటాడు కూడా. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలోని కళింజర్ ప్రాంతంలో పాములను ఇష్టపడే వ్యక్తి మహమ్మద్ మన్నన్. విషపూరితమైన పాములను పట్టుకుని, వాటితో ఆడుకుంటూ అడవిలో వదిలేస్తాడు. ఏ పాము తనకు హాని చేయదని.. పూర్వ జన్మలో పాములతో కొంత సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతున్నాడు ఇతడు.  ఇతని గురించి అటవీ శాఖ అధికారులు చెబుతుంటారు.

అడవుల్లో విషసర్పాలు: 

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో బందా జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతం ఉంది. దీనితో పాటు, అజయ్‌గర్, కలైంజర్, పన్నా, ఛతర్‌పూర్, సత్నా వంటి ప్రాంతాల్లో కూడా దట్టమైన అడవి ఉంది. ఈ అటవీప్రాంతం అనేక రకాల  జంతువులకు, విషపూరిత పాములకు నివాసం. వీటిని రక్షించేందుకు మహ్మద్ మన్నన్‌కు అటవీ శాఖ అధికారం ఇచ్చింది. మహమ్మద్ మన్నన్ అడవి నుంచి నివాస ప్రాంతాలకు.. లేదా అడవి నుంచి బయటకు వచ్చే నల్ల నాగుపాము, రెండు తలల పాము, ఆవు, గుర్రం, ముంగిస, నల్ల తేలు, పీత, పులి.. ఇలా ఏరకమైన జంతువులనైనా రక్షిస్తాడు. వెంటనే వాటిని తిరిగి అడవిలో వదిలేస్తాడు.

కాంట్రాక్టు పద్ధతిలో వ్యక్తుల నియామకం:  కలింజర్, అజయ్ ఘర్, ఫతే గంజ్ అడవుల్లోప్రమాదకర జీవులు నివసిస్తున్నాయని బండా అటవీ శాఖ డీఎఫ్‌వో ఏకే అగర్వాల్ తెలిపారు.  అడవుల నుంచి విషపూరితమైన ప్రమాదకరమైన కింగ్ కోబ్రా, కొండ చిలువ, ఎర్ర రాచ నాగు, కట్లపాము వంటి అనేక రకాల పాములు తరచుగా సమీపంలోని నివాస ప్రాంతాలకు వస్తుంటాయి. సమాచారం అందిన వెంటనే వాటిని రక్షించి అడవుల్లోకి వదులుతున్నారు. ఈ పని చేయాలంటే మహ్మద్ మన్నన్ లాంటి వారినినియమించుకోవడం తప్పని సరి అని అంటున్నారు. ( Source )

Also Read:   

Inspiring Video: ఊతకర్రతో బాలిక పరుగు పందెం.. డిప్యూటీ కలెక్టర్ మనసు దోచేసిన చిన్నారి