Bank Robbery: భారీ సొరంగం తవ్వి బ్యాంకును కొల్లగొట్టిన దొంగలు.. ఎంత ఎత్తుకెళ్లారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ చోరీ జరిగింది. దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు. 10 అడుగుల పొడైవన సొరంగ మార్గం ఏర్పాటు చేసుకుని మరీ దొంగలు ఆ బ్యాంకును
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ చోరీ జరిగింది. దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు. 10 అడుగుల పొడైవన సొరంగ మార్గం ఏర్పాటు చేసుకుని మరీ దొంగలు ఆ బ్యాంకును దోచుకున్నారు. కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. ఈ చోరీకి సంబంధించి పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భానుతి బ్రాంచ్‌లో దొంగలు పడ్డారు. బ్యాంకు వెనుక భాగం నుంచి 10 అడుగుల మేర సొరంగం తవ్వి బ్యాంకులో చొరబడ్డారు. అయితే, ఈ దుండగులు బ్యాంక్‌లోని గోల్డ్ చెస్ట్‌లోకి ప్రవేశించి కోటి రూపాయలకు పైగా విలువైన 1.8 కిలోల బంగరాన్ని ఎత్తుకెళ్లారు. క్యాష్ చెస్ట్‌ను బద్దలు కొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో.. బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు.
మరుసటిరోజు ఉదయం బ్యాంకు అధికారులు వచ్చి చూడా భారీ సొరంగం మార్గం కనిపించింది. బ్యాంకులో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్న అధికారులు.. పోలీసులకు ఫిర్యాదుు చేశారు. వెంటనే బ్యాంకు వద్దకు వెళ్లిన పోలీసులు.. ఫోరెన్సిక్ అధికారుల సహాయంతో సాక్ష్యాలు సేకరించారు. నిందితులు ఎవరు? అనేది కనిపెట్టడానికి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు బ్యాంకు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం నుంచి 4 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో సొరంగ మార్గం తవ్వి.. బ్యాంకులో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు.
చోరీ కేసులో కొన్ని వేలిముద్రలు లభించాయన్నారు పోలీసులు. కాగా, బ్యాంకులో చోరీకి ముందు రెక్కీ నిర్వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు పోలీసులు. నిందితులకు బ్యాంకు నిర్మాణం, స్ట్రాంగ్ రూమ్, గోల్డ్ చెస్ట్‌లకు సంబంధించిన వివరాలన్నీ బాగా తెలుసునని, ఇది బయటి వారి చేసిన పనా? లేక బ్యాంకు సంబంధిత వర్గాలు చేసిన పనా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
The underground tunnel that was dug by the thieves to break into the bank’s strong room in the heist at an SBI branch in Kanpur. The total cost of the stolen gold is yet to be estimated by the bank officials. pic.twitter.com/JHilMqzwA0
— Piyush Rai (@Benarasiyaa) December 23, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..