Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌పై వచ్చిన దుండగులు.. బీజేపీ నేతకు ఇంజెక్షన్ చేసి పరార్.. ఆసుపత్రికి తరలిస్తుండగా..!

గుల్ఫం సింగ్ యాదవ్ గత మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2004లో గన్నౌర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడుగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ ఉపాధ్యక్షుడుగా, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ, బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవులను కూడా నిర్వహించారు.

బైక్‌పై వచ్చిన దుండగులు.. బీజేపీ నేతకు ఇంజెక్షన్ చేసి పరార్.. ఆసుపత్రికి తరలిస్తుండగా..!
Gulfam Singh Yadav
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 11, 2025 | 8:16 AM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేతకు విషం ఇచ్చి చంపారు దుండగులు. సాంభాల్ జిల్లాలోని జునావాయి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సోమవారం(మార్చి 10) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు ఒకరు బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు విష ఇంజెక్షన్ ఇవ్వడంతో మరణించారు. జునాబాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్తారా గ్రామంలోని తన ఇంట్లో గుల్ఫం సింగ్ యాదవ్ (60) కూర్చుని ఉండగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చారు. వచ్చిరావడంతోనే అతనికి ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయారు. దీంతో ఒళ్లంతా విషం పాకి ప్రాణాలు కోల్పోయినట్లు గన్నౌర్ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ దీపక్ తివారీ తెలిపారు.

గుల్ఫం సింగ్ యాదవ్ పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం అలీఘర్‌కు తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో ఆయన మరణించారని CO దీపక్ తివారీ తెలిపారు. యాదవ్ కుటుంబం నుండి ఇంకా ఎటువంటి ఫిర్యాదు రాలేదని, అయితే ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక పోలీసు బృందాన్ని నియమించామని తివారీ తెలిపారు. గుల్ఫం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు.

పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం, గుల్ఫామ్ సింగ్ కుటుంబం అతనిపై కాల్పులు జరిపినట్లు అనుమానించి మొదట జునావారీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ వైద్యుడు అతనికి విషయం ప్రయోగం జరిగినట్లు సూచించారు. చికిత్స కోసం అలీఘర్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గల్ఫామ్ సింగ్ యాదవ్ ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

గుల్ఫం సింగ్ యాదవ్ గత మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2004లో గన్నౌర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడుగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ ఉపాధ్యక్షుడుగా, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ, బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవులను కూడా నిర్వహించారు. ఇది కాకుండా, అతని భార్య జావిత్రి దేవి వరుసగా మూడుసార్లు గ్రామ అధిపతిగా ఉన్నారు. 2019లో జునావారీ బ్లాక్ చీఫ్ ఉప ఎన్నికలో గుల్ఫం సింగ్ యాదవ్ కుమారుడు దివ్య ప్రకాష్ యాదవ్ బ్లాక్ చీఫ్‌గా ఎన్నికయ్యారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!