PM Modi Mauritius Visit: రెండు రోజుల పర్యటనకు మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీ..!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం(మార్చి 11) ఉదయం మారిషస్ చేరుకున్నారు. మారిషస్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడ మార్చి 12న జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ దళాల బృందంతో పాటు భారత నావికాదళ నౌక కూడా పాల్గొంటుంది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం(మార్చి 11) ఉదయం మారిషస్ చేరుకున్నారు. మారిషస్ చేరుకున్న ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడ మార్చి 12న జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ దళాల బృందంతో పాటు భారత నావికాదళ నౌక కూడా పాల్గొంటుంది. తన రెండు రోజుల పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ భారతదేశం – మారిషస్ మధ్య సామర్థ్య నిర్మాణం, వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం వంటి రంగాలలో సహకారం కోసం అనేక ఒప్పందాలపై సంతకం చేస్తారు.
మారిషస్‌లోని ప్రముఖులు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులం ప్రధాని మోదీకి పూలమాల వేసి సత్కరించారు. ఆయనతో పాటు ఉప ప్రధాన మంత్రి, మారిషస్ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, విదేశాంగ మంత్రి, కేబినెట్ కార్యదర్శి, గ్రాండ్ పోర్ట్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చైర్మన్ తోపాటు అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, దౌత్య వర్గాలు, మత పెద్దలు సహా మొత్తం 200 మంది ప్రముఖులు హాజరయ్యారు.
మారిషస్‌లోని ప్రవాస భారతీయులు ప్రధాని మోదీని స్వాగతించడానికి పోర్ట్ లూయిస్‌లోని ఒక హోటల్ వెలుపల పెద్దఎత్తున తరలివచ్చారు. భారత ప్రవాస భారతీయుడు శరద్ బరన్వాల్ మాట్లాడుతూ, ‘ప్రధాని రాకతో సంబరం చేసుకుంటున్నామన్నారు. భారతదేశం – మారిషస్ మధ్య స్నేహం ఎల్లప్పుడూ బాగుంది. ప్రధాని మోదీ ఈ పర్యటన తర్వాత, ఈ సంబంధం మరింత బలపడుతుందన్నారు. మారిషస్‌లోని భారత హైకమిషనర్ సాంస్కృతిక కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య తదితరులు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు తరలివచ్చారు.
‘మారిషస్ చేరుకున్నాను’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు నా స్నేహితుడు ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులమ్‌కు నేను కృతజ్ఞుడను. ఈ సందర్శన ఒక విలువైన స్నేహితుడిని కలవడానికి, వివిధ రంగాలలో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఒక గొప్ప అవకాశం. ఈ రోజు నేను అధ్యక్షుడు ధరమ్ గోఖూల్, ప్రధాన మంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూడల్‌లను కలుస్తాను. సాయంత్రం ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తాను.’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ – మారిషస్ మధ్య స్నేహం ఎల్లప్పుడూ చాలా బాగుంది. ప్రధాని మోదీ ఈ పర్యటన తర్వాత, ఈ సంబంధం మరింత బలపడుతుందంటున్నారు విశ్లేషకులు.
Deeply touched by the warm welcome from the Indian community in Mauritius. Their strong connection to Indian heritage, culture and values is truly inspiring. This bond of history and heart continues to thrive across generations. pic.twitter.com/kVjPhTixR8
— Narendra Modi (@narendramodi) March 11, 2025
మారిషస్‌లోని ప్రవాస భారతీయులు ప్రధాని మోదీని స్వాగతించడానికి పోర్ట్ లూయిస్‌లోని ఒక హోటల్ వెలుపల పెద్దఎత్తున తరలివచ్చారు. భారత ప్రవాస భారతీయుడు శరద్ బరన్వాల్ మాట్లాడుతూ, ‘ప్రధాని రాకతో సంబరం చేసుకుంటున్నామన్నారు. భారతదేశం – మారిషస్ మధ్య స్నేహం ఎల్లప్పుడూ బాగుంది. ప్రధాని మోదీ ఈ పర్యటన తర్వాత, ఈ సంబంధం మరింత బలపడుతుందన్నారు. మారిషస్‌లోని భారత హైకమిషనర్ సాంస్కృతిక కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య తదితరులు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు తరలివచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా మారిషస్‌లో గంగా తలాబ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మారిషస్‌లో అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్ర స్థలంగా పిలువబడే గంగా తలావ్ భారతదేశంలోని పవిత్ర గంగా నదికి ప్రతీక. అలాగే సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని భావిస్తున్నారు. 1972లో గంగా జలాన్ని దాని నీటిలో కలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..