AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అయోధ్యకు ప్రధాని మోదీ.. రాంలాలా దర్శనం తర్వాత 2 కిలోమీటర్ల రోడ్ షో

అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ మే 5 ఆదివారం అయోధ్యకు రానున్నారు. రాముడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత, ప్రధాని మోదీ లతా మంగేష్కర్ చౌక్ నుండి సుగ్రీవ్ ఫోర్ట్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా రోడ్ షో నిర్వహించనున్నారు.

PM Modi: అయోధ్యకు ప్రధాని మోదీ.. రాంలాలా దర్శనం తర్వాత 2 కిలోమీటర్ల రోడ్ షో
Pm Modi
Balaraju Goud
| Edited By: |

Updated on: May 05, 2024 | 11:36 AM

Share

అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ మే 5 ఆదివారం అయోధ్యకు రానున్నారు. రాముడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత, ప్రధాని మోదీ లతా మంగేష్కర్ చౌక్ నుండి సుగ్రీవ్ ఫోర్ట్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అయోధ్య పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. దీనికి ముందు ఆదివారం మే 5వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. అయోధ్యలో మొదట రామలాలా స్వామిని దర్శించుకుని, ఆ తర్వాత రోడ్ షో నిర్వహిస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల మొదలైన తర్వాత ప్రధాని తొలిసారిగా అయోధ్యకు వెళ్తున్నారు.

ప్రధాని మోదీ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రతిరోజూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ షోలు, ఎన్నికల సభల్లో ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం అంటే మే 5న అయోధ్యకు చేరుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయన అయోధ్యకు వెళ్తున్నప్పటికీ, ఆయన కార్యక్రమానికి ముందు రామాలయంలో రామలాలా స్వామిని దర్శించుకుంటారు.

అయోధ్య చేరుకున్న తర్వాత, ప్రధాని రామాలయంలో ప్రార్థనలు చేస్తారు, ఆపై ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తారు. ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇటావా చేరుకుంటారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు, ప్రధానమంత్రి ధౌరహర లోక్‌సభ నియోజకవర్గానికి బయలుదేరి అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీని తర్వాత, ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రామాలయంలో రామలాలా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అయోధ్యలో దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా నిర్వహించనున్నారు ప్రధాని

ప్రధాని మోదీ మే 5వ తేదీ సాయంత్రం 6:40 గంటలకు సీతాపూర్‌లోని ధౌరహర హెలిప్యాడ్‌ నుంచి ఎంఐ-17 హెలికాప్టర్‌లో సాయంత్రం 5:35 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 6:45 గంటలకు బయలుదేరి ఏడు గంటలకు రామజన్మభూమికి చేరుకుంటారు. రాత్రి 7 నుంచి 7:15 వరకు రాంలాలా ఆలయంలో ఉంటారు. ఇక్కడ దర్శనం, పూజలు చేసిన తరువాత, రాత్రి 7:15 గంటలకు రామజన్మభూమి మార్గం సమీపంలోని సుగ్రీవ కోట నుండి రోడ్ షో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి లతా మంగేష్కర్ చౌక్‌కు రెండు కిలోమీటర్ల దూరం ఒక గంటలో చేరుకుంటారు. లతాచౌక్‌లో రోడ్ షో ముగించుకుని రాత్రి 8:20 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. ఇక్కడి నుంచి రాత్రి 8:40 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన బీబీజే విమానం ఒరిస్సాలోని భువనేశ్వర్‌కు బయలుదేరుతుంది.

ఇక్బాల్ అన్సారీ కామెంట్స్..

అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన, రోడ్ షో నేపధ్యంలో రామజన్మభూమి కేసులో న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడి నగరం నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం ఎంతో అదృష్టమని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ నరేంద్ర మోదీ ఎన్నో మహోన్నత కార్యక్రమాలు చేశారు. ఆదివారం ఆయన అయోధ్యకు విచ్చేయడం మమ్మల్ని ఎంతగానో సంతోషాన్ని కలిగించింది. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నామని అన్సారీ అన్నారు.

మే 20న ఐదో దశలో అయోధ్యలో పోలింగ్‌ జరగనుంది. శనివారం, జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని, అయోధ్య రాముడి కోసం 500 సంవత్సరాలుగా ఎంతమంది పోరాడుతూనే ఉన్నారు, లక్షల మంది ప్రజలు బలిదానం చేస్తూనే ఉన్నారు, సుదీర్ఘ పోరాటం జరిగింది. బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇంత సుదీర్ఘ పోరాటం జరిగి ఉండకపోవచ్చు. మీ ఓటు బలంతో ఈరోజు అయోధ్యలో రామమందిరం కట్టామన్నారు ప్రధాని మోదీ.జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు రాంలాలా ప్రతిష్ఠించారు. పవిత్రోత్సవానికి ముందు, ప్రధాని నరేంద్ర మోడీ 11 రోజుల కష్టతరమైన కర్మను నిర్వహించారు. ఈ సమయంలో కఠిన నియమాలను పాటించారు. కొబ్బరినీళ్లు మాత్రమే సేవించి నేలపై పడుకున్నారు. ఇదిలావుంటే, ఫైజాబాద్‌లో ఐదో దశలో పోలింగ్ జరగనుంది. మే 20న ఇక్కడ ఓటింగ్ జరగనుంది. ఐదో దశలో మోహన్‌లాల్‌గంజ్, లక్నో, రాయ్ బరేలీ, అమేథీ, జలౌన్, ఝాన్సీ, హమీర్‌పూర్, బందా, ఫతేపూర్, కౌశాంబి, బారాబంకి, కైసర్‌గంజ్ మరియు గోండాలో కూడా ఓటింగ్ జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…