5 నెలల పసికందుపై మేనమామ హత్యాచారం.. ఉరి శిక్ష వేసిన కోర్టు.. న్యాయమూర్తి ఎమోషనల్

అతడు మనిషి కాదు నీచుడు.  కాదు.. కాదు.. రాక్షసుడు. 5 నెలల పసికందు(మేనకోడలి)పై లైంగిక దాడి చేసి చంపేశాడు. అతడికిప్పుడు న్యాయస్థానం సరైన శిక్ష విధించింది.

5 నెలల పసికందుపై మేనమామ హత్యాచారం.. ఉరి శిక్ష వేసిన కోర్టు.. న్యాయమూర్తి ఎమోషనల్
Sentenced To Death
Follow us

|

Updated on: Oct 01, 2021 | 9:47 AM

అతడు మనిషి కాదు నీచుడు.  కాదు.. కాదు.. రాక్షసుడు. 5 నెలల పసికందు(మేనకోడలి)పై లైంగిక దాడి చేసి చంపేశాడు. చిన్నారిపై హత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి కంప్లైంట్ మేరకు యూపీలోని మదియాన్ పోలీస్​స్టేషన్​లో 2020 ఫిబ్రవరి 17న ఎఫ్​ఐర్​ నమోదైంది. వెంటనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో విచారణ జరిగింది. సాక్షాధారాలన్నీ అతడు నేరం చేసినట్లు తేలడంతో… ఆ కామాంధుడికి ఉరిశిక్ష విధించింది ఉత్తర్​ప్రదేశ్​ లక్నో పోక్సో కోర్టు.  రూ.70వేల ఫైన్ కూడా విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలి తండ్రికి అందజేయాలని ఆదేశించింది. ఈ శిక్షను హైకోర్టు ఖరారు చేశాక దోషిని ఉరి తీయాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది.  ఈ తీర్పు చెబుతూ జడ్జి అరవింద్ మిశ్రా ఎమోషనల్ అయ్యారు. ఇది అత్యంత అరుదైన క్రూర ఘటన అయినందున దోషికి ఉరిశిక్ష తప్ప ఇతర శిక్ష విధించేందుకు నిరాకరించారు. జంతువులు కూడా ఇలాంటి కిరాతక చర్యలకు పాల్పడవని ఆవేదన వ్యక్తం చేశారు.

మనదేశంలో చిన్నారులను దైవ స్వరూపులుగా భావిస్తారని… నవరాత్రి సమయంలో దుర్గామాత అవతారంలో ఉన్న బాలికలను పూజిస్తారని న్యాయమూర్తి గద్గద స్వరంతో చెప్పారు. వాళ్లకు ఆహారం పెట్టాకే భక్తులు ఉపవాసం విరమిస్తారని.. ఇలాంటి పరిస్థితుల్లో పసికందును అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత అరుదైన, క్రూరమైన కేసుగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. ఈ దోషి నేరానికి పాల్పడిన తీరు చూస్తే మానవతా సంబంధాలను ప్రజలను విశ్వసించడం మానేస్తారని అభిప్రాయపడ్డారు. సామాజిక నిర్మాణాన్ని ఇలాంటి ఘటనలు నాశనం చేస్తాయని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ‘ఎవరు గొప్ప’ అంటూ ఇద్దరు సెవెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఫైట్.. ఒకరు మృతి

 ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు