Watch Video: చేతిలో బిడ్డ ఉన్నా.. కనికరం లేకుండా కొట్టాడు.. ఎస్ఐ తీరుపై సర్వత్రా విమర్శలు.. వీడియో
Cop Beats Man: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి బిడ్డను తీసుకొచ్చిన వ్యక్తిని.. ఓ ఎస్‌ఐ తీవ్రంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..

Cop Beats Man: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి బిడ్డను తీసుకొచ్చిన వ్యక్తిని.. ఓ ఎస్‌ఐ తీవ్రంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన పాల్పడిన ఎస్‌ఐను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఓపీడీ సేవలకు ఆటంకం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ చిన్నారిని తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసు తీవ్రంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, పలువురు నేతలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సాధారణ ప్రజలను హింసించడం ఎంటంటూ ప్రశ్నిస్తున్నారు. బలహీనులకు న్యాయం జరగాలంటే.. పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉండాలని వరుణ్ గాంధీ సూచించారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం కాన్పూర్ దేహత్‌లోని అక్బర్‌పూర్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో జరిగింది.
దాదాపు నిమిషం ఉన్న వైరల్ వీడియోలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ – చిన్నారిని తీసుకెళ్తున్న వ్యక్తిని కర్రలతో కొట్టడం కనిపించింది. పిల్లవాడు తీవ్రంగా ఏడుస్తున్నా.. మరో పోలీసు కనికరం లేకుండా బాధితుడి చేతుల్లో నుంచి.. పిల్లవాడిని బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. తన చేతుల్లో బిడ్డ ఉందని.. పదేపదే చెబుతున్నా వదిలిపెట్టకుండా లాఠీలతో కొట్టాడు. ఆ తరువాత అతను అక్కడి నుంచి వెళుతుండా.. పోలీసులు ఆ వ్యక్తిని వెంబడించి.. పట్టుకున్నారు. ఏడుస్తున్న చిన్నారిని, బాధితుడిని పోలీసులు కారు ఎక్కించేందుకు ప్రయత్నించారు. సార్ పిల్లవాడికి తల్లి లేదని.. వదిలిపెట్టాలని కోరుతూ అతను ప్రాథేయపడటం కనిపించింది.
వీడియో..
सशक्त कानून व्यवस्था वो है जहां कमजोर से कमजोर व्यक्ति को न्याय मिल सके।
यह नहीं कि न्याय मांगने वालों को न्याय के स्थान पर इस बर्बरता का सामना करना पड़े,यह बहुत कष्टदायक है।भयभीत समाज कानून के राज का उदाहरण नहीं है।
सशक्त कानून व्यवस्था वो है जहां कानून का भय हो,पुलिस का नहीं। pic.twitter.com/xoseGpWzZH
— Varun Gandhi (@varungandhi80) December 10, 2021
కాగా.. ఈ ఘటన అనంతరం నాయకులు కాన్పూర్ దేహత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాన్పూర్ పోలీసులు సైతం ఓ ప్రకటన చేశారు. రజనీష్ శుక్లా అనే 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగి 100-150 మందితో కలిసి జిల్లా ఆసుపత్రి ఓపీడీ ని మూసివేసి ఆందోళన చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసు బృందం అక్కడికి వెళ్లిందని సూపరింటెండెంట్ ఘనశ్యామ్ చౌరాసియా తెలిపారు. అయితే.. వైరల్ వీడియో క్లిప్‌లో కనిపించిన వ్యక్తి శుక్లా సోదరుడని.. అతను కూడా గుంపును రెచ్చగొడుతున్నాడని చౌరాసియా తెలిపారు.
ఈ క్రమంలో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది చాలా సున్నితత్వం విషయమని.. ఈ ఘటన అనంతరం ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ మిశ్రాను సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Also Read:
