Inter Results: మాజీ మంత్రివర్యులు ఇంటర్ పాస్ అయ్యారోచ్.. 56 ఏళ్ల వయసులోనూ తగ్గేదే అంటున్న ఆయనెవరో తెలుసా?
ఉత్తరప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఈ ఫలితాలను విడుదల చేసింది. అయితే, ఈ ఫలితాలకు ఓ స్పెషల్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే, ఇందులో ఏంటి స్పెషల్ అనేగా సందేహం.. ఆ మ్యాటరే ఇప్పుడు తెలుసుకుందాం.

59 ఏళ్ల వయసులో ఇంటర్మీయట్ సెకండియర్ పరీక్ష రాసిన మాజీ మంత్రి ప్రభుదయాల్ వాల్మీకి కూడా పాస్ అయ్యారు. ఆయనతో పాటు.. మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్ర సైతం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడిదే రాష్ట్ర వ్యాప్తంగా, కాదు కాదు.. దేశ వ్యాప్తంగా ఇంట్రస్టింగ్ టాపిక్ అయ్యింది. వారి పట్టుదల.. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
వివరాల్లోకెళితే.. యూపీలోని మీరఠ్ జిల్లా హస్తినాపూర్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా సేవలందించారు. అయితే, ప్రభుదయాల్ తన 59 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో ఆయన సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యారు. అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని, పరీక్షలు రాసినట్లు ఆయన చెప్పారు. విద్యార్థి దశలో సమస్యల కారణంగా చదువుకోలేకపోయానని, ఇప్పుడు చదువుకున్నానని సంతోషంగా చెప్పారు. మనసులో బలమైన కోరిక ఉంటే.. ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చునని అన్నారు. సమయం ఉంటే ఉన్నత చదువులు చదువుతానని కూడా చెప్పారు ప్రభుదయాల్.

ఇక బరేలీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్ర కూడా ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. సెకండ్ క్లాస్‌లో పాసైన ఆయన.. తన చదువును కొనసాగిస్తానని చెప్పారు. లాయర్ అవ్వడమే తన లక్ష్యం అని, ఎల్‌ఎల్‌బీ చేసి పేదలకు సహాయం చేస్తానని తెలిపారు. కాగా, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన రాజేశ్.. తన అనుచరులకు స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..