Wolf Terror: బహ్రైచ్‌లో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి తోడేలు.. నిద్రిస్తున్న బాలికపై దాడి.. పరిస్థితి విషమం

మంగళవారం రాత్రి ఓ బాలిక తన ఇంటి హాలులో నిద్రిస్తోంది. ఇంతలో తోడేలు నిశబ్దంగా వచ్చి బాలికపై దాడి చేసింది. దీంతో బాలిక గట్టిగా అరచింది. ఆ అరుపులు విన్న బాలిక కుటుంబ సభ్యులు లేచి కర్రతో తోడేలును వెంబడించారు. అయితే దానిని పట్టుకోలేకపోయారు. గాయపడిన బాలికను వెంటనే మహసీ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బాలిక శరీరంపై తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది.

Wolf Terror: బహ్రైచ్‌లో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి తోడేలు.. నిద్రిస్తున్న బాలికపై దాడి.. పరిస్థితి విషమం
Wolf Attack
Follow us

|

Updated on: Sep 11, 2024 | 9:22 AM

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఇప్పటి వరకు 5 తోడేళ్లను బంధించారు. అయినా తోడేళ్ల భీభత్సం ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం రాత్రి కూడా నరమాంస భక్షక తోడేలు మళ్లీ ఓ బాలికపై దాడి చేసింది. ఈ దాడిలో 11 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. బాలికను వెంటనే మహసీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళవారం కూడా అటవీ శాఖ బృందాలు తోడేలును పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశాయి.

ఇప్పటివరకు ఇక్కడ 5 తోడేళ్లను బంధించారు. అయితే ఈ తోడేళ్ల బృందంలోని ఆరవ తోడేలు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి ఓ బాలిక తన ఇంటి హాలులో నిద్రిస్తోంది. ఇంతలో తోడేలు నిశబ్దంగా వచ్చి బాలికపై దాడి చేసింది. దీంతో బాలిక గట్టిగా అరచింది. ఆ అరుపులు విన్న బాలిక కుటుంబ సభ్యులు లేచి కర్రతో తోడేలును వెంబడించారు. అయితే దానిని పట్టుకోలేకపోయారు. గాయపడిన బాలికను వెంటనే మహసీ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బాలిక శరీరంపై తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఆరవ తోడేలును పట్టుకోవడంలో బృందం బిజీగా ఉంది

ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డాక్టర్ ఆశిష్ వర్మ మాట్లాడుతూ.. బాలిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అయినప్పటికీ బాలికను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. బాలికను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో 6 తోడేళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ తోడేళ్లన్నింటినీ పట్టుకునేందుకు అటవీ శాఖ బృందాలు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే క్రమంలో మంగళవారం ఉదయం మహసీ తహసీల్‌లోని సీసయ్య చునామణి గ్రామానికి చెందిన తోడేలును అటవీశాఖ బృందం అదుపు చేసింది. ఇప్పటివరకు ఐదు తోడేళ్లను బంధించారు. ఇప్పుడు ఆరవ తోడేలును పట్టుకోవడానికి బృందాలు ఉచ్చులు వేయడం ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి

మునుపటి కంటే మరింత అప్రమత్తంగా మారిన తోడేళ్లు

బహ్రైచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ ప్రకారం ఆరవ తోడేలుని ఇంకా బంధించలేదు. అయితే దానిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ తోడేలు చాలాసార్లు ట్రాక్ చేయబడింది..అయితే తనని గుర్తించారని పసిగట్టగానే దట్టమైన అడవిలోకి పారిపోతుందని చెప్పారు. అటవీశాఖ చురుకుదనాన్ని చూసి తోడేలు తాను దాడి చేసే పద్ధతి మార్చుకుంటుందని అన్నారు. ఇప్పుడు గతంలో కంటే మరింత జాగ్రత్త పడింది. ఎంతగా అంటే డ్రోన్ శబ్ధం వింటేనే పరిగెత్తే స్థాయికి పరిస్థితి చేరుకుంది. దీనివల్ల డ్రోన్లు కెమెరాకు తోడేళ్లు కనిపించడం లేదని తెలిపారు. ఈ తోడేళ్ల దాడిలో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..