ఓరేయ్.. ఇంకా మీరు మారర్రా.. పెళ్లి వేడుకల్లో దళిత వరుడు గుర్రంపై ఊరేగినందుకు అగ్రవర్ణ వ్యక్తుల రాళ్ల దాడి

దేశంలో ఓవైపు సాంకేతిక రంగం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే.. మరోవైపు దళితుల పట్ల కుల వివక్ష మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట దళితులపై కొందరు అగ్రవర్ణాలు కుల వివక్ష పేరిట దూషించడం, దాడి చేయడం లాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ దళిత వ్యక్తి తన పెళ్లి వేడుకల్లో గుర్రంపై ఊరేగుతుండగా.. ఇది చూసి తట్టుకోలేని కొంతమంది మదమెక్కిన అగ్రవర్ణ వ్యక్తులు అతనిపై రాళ్లు విసిరి దాడి చేయడం కలకలం రేపింది.

ఓరేయ్.. ఇంకా మీరు మారర్రా.. పెళ్లి వేడుకల్లో దళిత వరుడు గుర్రంపై ఊరేగినందుకు అగ్రవర్ణ వ్యక్తుల రాళ్ల దాడి
Dalit Groom
Follow us
Aravind B

|

Updated on: Jun 07, 2023 | 12:14 PM

దేశంలో ఓవైపు సాంకేతిక రంగం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే.. మరోవైపు దళితుల పట్ల కుల వివక్ష మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట దళితులపై కొందరు అగ్రవర్ణాలు కుల వివక్ష పేరిట దూషించడం, దాడి చేయడం లాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ దళిత వ్యక్తి తన పెళ్లి వేడుకల్లో గుర్రంపై ఊరేగుతుండగా.. ఇది చూసి తట్టుకోలేని కొంతమంది మదమెక్కిన అగ్రవర్ణ వ్యక్తులు అతనిపై రాళ్లు విసిరి దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే సోమవారం రోజున చట్టార్పూర్ జిల్లాలోని రితేష్ అహివర్ అనే దళిత వ్యక్తి వివాహం జరుగుతోంది. ఈ వేడుకలో భాగంగా పెళ్లి కొడుకును గుర్రంపై గ్రామంలో ఊరేగిస్తున్నారు. ఈ ఊరేగింపు సాగుతుండగానే వరుడు రితేష్‌, అతని కుటుంబ సభ్యులు గుడికి వెళ్లి దర్శించుకోవాలనుకొన్నారు. అయితే అక్కడికి వచ్చిన కొంతమంది అగ్రవర్ణ వ్యక్తులు దీనిపై అభ్యంతరం చేశారు.

ఊరేగింపును ఆపి.. గుడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాళ్ల గొడవను ఆపారు. చివరికి పోలీసుల సమక్షంలో వరుడు రితేష్, అతని కుటుంబ సభ్యులు గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేడుకలో భాగంగానే రితేష్‌ను ఊరేగిస్తూ ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అది చూసి సహించని అగ్రవర్ణ వ్యక్తులు వరుడు రితేష్‌తో సహా అతని కుటుంబ సభ్యులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వరుడు కుటుంబ సభ్యులతో పాటు ముగ్గురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు పలు సెక్షన్ల కింద దాదాపు 50 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా గుజరాత్‌లోని పఠాన్ జిల్లాలోని ఓ పాఠశాలలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అందిరితో పాటు ఆ మ్యాచ్ చూస్తున్న ఓ దళిత బాలుడు క్రికెట్ బాల్‌ని పట్టుకున్నాడు. దీంతో కోపంతో ఓ అగ్రవర్ణ వ్యక్తి ఆ బాల్‌ని పట్టుకున్నందుకు ఆ బాలుడ్ని బెదిరించి, కులంతో దూషించాడు. ఇది గమనించిన ఆ బాలుడి మామయ్య ధీరజ్ పర్మర్ ఆ వ్యక్తిని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ సద్దుమునిగిన అనంతరం ఏడుగురు వ్యక్తులు ధీరజ్‌తో పాటు అతని సోదరుడు కిర్టీపై కూలంతో దూషించారు. ఆ తర్వాత ఒంటిరిగా కనబడిన తన సొదరుడు కిర్టీ బొటన వేలుని కోసేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.