Viral: ఒక్క క్లూతో అడ్డంగా దొరికిన భార్య.. కట్ చేస్తే.. విచారణతో వెలుగులోకి సంచలన నిజం.!
ట్టుకున్న భర్తను కర్కశంగా చంపేసింది ఓ భార్య. తన ప్రియుడితో కలిసి పక్కాగా ప్లాన్ చేసి మట్టుబెట్టింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు తల, మొండం రెండింటినీ వేరు చేసింది. ఏమీ తెలియనట్టు ఇంటికొచ్చి..
కట్టుకున్న భర్తను కర్కశంగా చంపేసింది ఓ భార్య. తన ప్రియుడితో కలిసి పక్కాగా ప్లాన్ చేసి మట్టుబెట్టింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు తల, మొండం రెండింటినీ వేరు చేసింది. ఏమీ తెలియనట్టు ఇంటికొచ్చి.. తన భర్త కనబడట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన ఖాకీలు.. ఆ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. కానీ ఒకే ఒక్క క్లూతో మొత్తం కేసు తారుమారైంది. చివరికి భార్య బాగోతం కాస్తా బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ట్రానికా సిటీలో నివసిస్తున్న 62 ఏళ్ల రాజేష్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం కనిపించకుండా పోయాడు. తన భర్త మిస్సింగ్ అంటూ అతడి భార్య బబిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్‌కి బబిత రెండో భార్య. తొలుత దీన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఆ వైపుగా దర్యాప్తు కొనసాగించారు. కానీ విచారణలో రాజేష్ కూతురు బబితపై అనుమానం ఉన్నట్లు చెప్పింది. తన తండ్రిని హత్య చేసి ఉంటారని.. ఇందులో బబిత పాత్ర ఉందంటూ పోలీసులకు తెలిపింది. దీంతో దర్యాప్తు కాస్తా మలుపు తిరిగింది.
స్థానికంగా బబితకు ఓ వ్యక్తితో అఫైర్ ఉన్నట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. తన భర్త ఆస్తిని అంతటా కూతురికి రాయాలనుకోవడంతో.. బబిత తన భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పక్కాగా ప్లాన్ వేసింది. దానికి తగ్గట్టుగా ఓ రోజు తన భర్త, ప్రియుడితో కలిసి పని మీద పక్క ఊరు వెళ్లింది. వచ్చేటప్పుడు రాత్రి అయిపోవడంతో ఆ ముగ్గురు ఓ ప్రాంతంలో చిన్న మంట వేసుకుని కూర్చున్నారు. ఇక ప్లాన్ ప్రకారం.. బబిత ప్రియుడు ఓ ఇటుకతో రాజేష్ తలపై కొట్టి అతడ్ని చంపేశాడు.
ఆ తర్వాత శవాన్ని పొలంలో వదిలేసి వెళ్లిపోయారు. కానీ ఎవరైనా గుర్తుపడతారేమోననే ఉద్దేశంతో వారు మళ్లీ తిరిగి వచ్చి.. తలను మొండాన్ని వేరు చేసి.. తలను సమీపంలో ఉన్న నదిలో పడేశారు. కాగా, రాజేష్ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బబిత ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా.. అతడు చివరికి నిజాన్ని బయటపెట్టాడు. చివరికి ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు.