AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ ! మరో దేశీ రోబో ‘ షాలూ’ సృష్టి, హ్యాట్సాఫ్ టు యూపీ ఐఐటీ ప్రొఫెసర్

యూపీ లోని జౌన్ పూర్ వాసి అయిన దినేష్ పటేల్ అనే ప్రొఫెసర్ అద్భుత సృష్టికి శ్రీకారం చుట్టారు. హ్యూమనాయిడ్ రోబో' సోఫియా' మాదిరి ఓ దేశీ రోబోని ఆయన సృష్టించారు.

వావ్ ! మరో దేశీ రోబో ' షాలూ' సృష్టి, హ్యాట్సాఫ్ టు యూపీ ఐఐటీ ప్రొఫెసర్
'shalu' The Robo
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 15, 2021 | 7:51 PM

Share

యూపీ లోని జౌన్ పూర్ వాసి అయిన దినేష్ పటేల్ అనే ప్రొఫెసర్ అద్భుత సృష్టికి శ్రీకారం చుట్టారు. హ్యూమనాయిడ్ రోబో’ సోఫియా’ మాదిరి ఓ దేశీ రోబోని ఆయన సృష్టించారు. ‘షాలూ’ అని వ్యవహరించే ఈ రోబో 38 భాషలు, 9 స్థానిక యాసలు మాట్లాడగలదట. కేవలం వంద శాతం ప్లాస్టిక్, అల్యూమినియం, కార్డ్ బోర్డ్ వంటి వృధా పదార్థాలను వినియోగించి ఈ రోబోని తయారు చేశానని ఆయన చెబుతున్నారు. ఇది మనుషులను గుర్తించగలదని, వారి ఎమోషన్స్ ని పసి గట్టగలదని, వార్తా పత్రికలు చదవగలదని..అంతెందుకు మనిషి చేసే ఎన్నో కార్యక్రమాలను పెర్ఫామ్ చేయగలదని దినేష్ పటేల్ చెప్పారు. ఈ వినూత్న రోబో గురించి ఈయన ఈయన తన యూట్యూబ్ పేజీల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ‘అప్నీ రోబో షాలూ’ పేరిట ఆయన వీటిని రిలీజ్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు ఈయన క్రియేటివిటీకి ముగ్ధులవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘ రోబో’ తనకు స్ఫూర్తి అని ఆయన తెలిపారు. ఆ మూవీని చాలాసార్లు చూసినట్టు చెప్పారు.

దినేష్ పటేల్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పటేల్ ప్రస్తుతం బాంబే ఐఐటీలో ప్రొఫెసర్ గా ఉన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ఈ రోబో సమాధానాలిస్తుందని, దీన్ని స్కూళ్ళు, కాలేజీలు  తదితర విద్యా సంస్థల్లో కూడా వినియోగించుకోవచ్చునని పటేల్ అంటున్నారు. షాలూను సృష్టించేందుకు  తనకు ఎంతో కాలం కూడా పట్టలేదని చెప్పిన ఆయన.. ‘సోఫియా’  రోబోను చూశాక కూడా  తనకు  అలంటి రోబో సృష్టించాలన్న ఆలోచన కలిగిందని చెప్పారు. బాంబే ఐఐటీలో ఈయన సహ ప్రొఫెసర్లు, విద్యార్థులు షాలూ రోబోని చూసి ఆశ్చర్యపోతూ..  ఇదొక వినూత్నమైన, అద్భుతమైన  రోబో అని పేర్కొంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: విశాఖపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నష్టాలను పూడ్చుకునేందుకు కఠిన నిర్ణయం తప్పదన్న నిర్మలా సీతారామన్

దేశంలోని పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర కుట్రలకు ప్లాన్‌ చేస్తున్న పలువురు అరెస్ట్‌