UP Bypoll 2022: యోగి మ్యాజిక్ మంత్రా.. ఆజంఖాన్ అడ్డాలో బీజేపీ జెండా.. 42వేల ఓట్ల భారీ మెజార్టీ

UP Rampur Bypoll 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న అధికార బీజేపీ... సమాజ్‌వాదీ పార్టీని గట్టి దెబ్బ కొట్టింది. ఎస్పీ సిట్టింగ్ స్థానమైన రాంపుర్ లోక్​సభ స్థానంలో బీజేపీ జండా ఎగురవేసింది. ఎస్పీ నేత ఆజంఖాన్ రాజీనామాతో..

UP Bypoll 2022: యోగి మ్యాజిక్ మంత్రా.. ఆజంఖాన్ అడ్డాలో బీజేపీ జెండా.. 42వేల ఓట్ల భారీ మెజార్టీ
Cm Yogi Adityanath
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 26, 2022 | 9:38 PM

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. జూన్ 23న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న అధికార బీజేపీ… సమాజ్‌వాదీ పార్టీని గట్టి దెబ్బ కొట్టింది. ఎస్పీ సిట్టింగ్ స్థానమైన రాంపుర్ లోక్​సభ స్థానంలో బీజేపీ జండా ఎగురవేసింది. ఎస్పీ నేత ఆజంఖాన్ రాజీనామాతో రాంపుర్ స్థానం ఖాళీ కాగా.. ఆ స్థానంలో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యామ్ లోధి సుమారు 42వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామ్‌పుర్‌ పార్లమెంటు పరిధిలో మొత్తం 18.38 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 60శాతం మంది ముస్లిం, మైనారిటీలే ఉన్నారు. దీంతో ఆ స్థానం ఆజంఖాన్‌కు కంచుకోటగా కొనసాగుతోంది. అయితే ఈ ఎస్పీ సీటును బద్దలుకొట్టిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆ ప్రాంతంలోనూ తన తిరుగులేని శక్తిగా నిలిచారు.

ఆజంగఢ్‌ను గెలిచిన బీజేపీ..

సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ  విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ 8679 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాంపుర్​లో బీజేపీ విజయంపై ఆజంఖాన్ అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్నిబీజేపీ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఏదైనా అంతర్జాతీయ సంస్థ ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలన్నారు. అప్పుడు కూడా ఎస్పీ అభ్యర్థి ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు.

జాతీయ వార్తల కోసం