ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాకం.. రూ.2,500 ఇస్తే నెగిటివ్‌ రిపోర్ట్

కరోనా నేపథ్యంలో టెస్ట్‌లు చేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ల్యాబ్‌లకు ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి.

ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాకం.. రూ.2,500 ఇస్తే నెగిటివ్‌ రిపోర్ట్
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 1:40 PM

కరోనా నేపథ్యంలో టెస్ట్‌లు చేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ల్యాబ్‌లకు ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి. ముఖ్యంగా ఫీజులు అందరికీ అందుబాటులో ఉండాలని, పరీక్షా ఫలితాల్లో పారదర్శకత ఉండాలని హెచ్చరిస్తున్నాయి. అయితే ప్రైవేట్‌ ల్యాబ్‌లు ఆ నిబంధనలను సరిగా పట్టించుకోవడం లేదు. పరీక్షల కోసం వచ్చిన వారి నుంచి డబ్బులను లాగడంతో పాటు ఫలితాలను సరిగా వెల్లడించడం లేదు. ఈ క్రమంలో మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ను తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాకానికి పాల్పడింది. కరోనా నెగిటివ్‌ రిపోర్ట్ ఇవ్వడం కోసం అక్కడి సిబ్బంది ప్రత్యేక డబ్బును వసూలు చేస్తోంది. 2,500 ఇస్తే నెగిటివ్‌ రిపోర్ట్‌ ఇస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కాస్త అధికారుల వద్దకు వెళ్లడంతో.. ఆ ల్యాబ్‌ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు మూసేశారు. దీనిపై కేసును నమోదు చేసుకున్నామని, విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని జిల్లా మేజిస్ట్రేట్‌ అనిల్ దింగ్రా వెల్లడించారు. కాగా వైరల్ అయిన వీడియోలో 2,500 ఇస్తే కరోనా నెగిటివ్‌ రిపోర్ట్ ఇస్తామని ఓ వ్యక్తి చెబుతున్నాడు. అతడిని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్థానిక పోలీసులు చెబుతున్నారు.