రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గిన చైనా సైన్యం..

గాల్వాన్ లోయలో భారతీయ సైనికులతో ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి సుమారు రెండు కిలోమీటర్లు చైనా దళాలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. వివాదాస్పదంగా మారిన ప్రాంతం నుంచి రెండు దేశాలు తాత్కాలిక...

రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గిన చైనా సైన్యం..
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2020 | 1:42 PM

గత కొద్ది రోజుల నుంచి భారత్-చైనాల మధ్య వివాదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. గాల్వాన్ లోయలో నెలకొన్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 యాప్‌లను.. ఇండియా బ్యాన్ చేసింది. అలాగే ఈ నెల 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కూడా లద్దాఖ్‌కి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అలాగే వేలాది భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మోదీ. చైనా పేరును ఆయన  నేరుగా ప్రస్తావించకుండా.. ‘విస్తరణ వాద శకం’ ముగిసిందని, ‘విస్తరించాలనుకుంటున్న శక్తులు’ ఓడిపోవడమో లేక వెనక్కి వెళ్లవలసిన పరిస్థితో ఏర్పడుతుందని డ్రాగన్ కంట్రీకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గాల్వాన్ లోయలో భారతీయ సైనికులతో ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి సుమారు రెండు కిలోమీటర్లు చైనా దళాలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విషయాన్ని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. వివాదాస్పదంగా మారిన ప్రాంతం నుంచి రెండు దేశాలు తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడైంది.

కాగా బలగాలతో పాటు వాహనాలను కూడా వెనక్కి మళ్లించింది చైనా. బఫర్ జోన్‌లోకి వెళ్లిపోయాయి ఇరు దేశాల సైనికులు. సరిహద్దు ప్రాంతంలో టెంట్లు, బంకర్లను సైతం తొలగించింది చైనా. ఉద్రిక్తంగా ఉన్న గాల్వాన్, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్‌ ప్రదేశాల నుంచి సైనికులను వెనక్కి పంపాలని జూన్ 30వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు మరోసారి వివాదాస్పద అంశాల గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: 

గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..

బ్రేకింగ్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు