AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఏంట్రా ఇలా ఉన్నారు..! 9 రోజుల్లో కూతురితో పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్.. ఇద్దరూ గుట్టుగా..

కూతురితో మరికొన్ని రోజుల్లో పెళ్లి.. కట్ చేస్తే.. కూతురు వాళ్ల అమ్మ.. అంటే అత్త లైన్లోకి వచ్చింది. కూతురు ఏమో కానీ.. ఆమె మాత్రం అల్లుడిపై మనసుపారేసుకుంది.. అతను కూడా ఈమెనే ఇష్టపడ్డాడు.. కట్ చేస్తే.. గంటలతరబడి ఫోన్లను మాట్లాడుకున్నారు.. ప్రేమలో వయస్సుదేముంది జస్ట్ నంబర్ మాత్రమే.. అనుకున్నారు.. గాఢంగా ప్రేమించుకున్నారు.. మరో తొమ్మిది రోజుల్లో కూతురుతో పెళ్లి ఉందనగా.. అత్త మాస్టర్ ప్లాన్ వేసింది.. ఏకంగా కాబోయే వరుడితో జంప్ అయింది..

Viral: ఏంట్రా ఇలా ఉన్నారు..! 9 రోజుల్లో కూతురితో పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్.. ఇద్దరూ గుట్టుగా..
Up News
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2025 | 2:20 PM

Share

కూతురితో మరికొన్ని రోజుల్లో పెళ్లి.. కట్ చేస్తే.. కూతురు వాళ్ల అమ్మ.. అంటే అత్త లైన్లోకి వచ్చింది. కూతురు ఏమో కానీ.. ఆమె మాత్రం అల్లుడిపై మనసుపారేసుకుంది.. అతను కూడా ఈమెనే ఇష్టపడ్డాడు.. కట్ చేస్తే.. గంటలతరబడి ఫోన్లను మాట్లాడుకున్నారు.. ప్రేమలో వయస్సుదేముంది జస్ట్ నంబర్ మాత్రమే.. అనుకున్నారు.. గాఢంగా ప్రేమించుకున్నారు.. మరో తొమ్మిది రోజుల్లో కూతురుతో పెళ్లి ఉందనగా.. అత్త మాస్టర్ ప్లాన్ వేసింది.. ఏకంగా కాబోయే వరుడితో జంప్ అయింది.. ఇద్దరూ కలిసి కనిపించకుండా పారిపోయారు.. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది.. తన కూతురు పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా ఓ మహిళ కాబోయే అల్లుడితో అత్త లేచిపోయింది.. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని అత్తా, అల్లుడు ఇద్దరూ ఇళ్లలో చెప్పి బయటకు వచ్చారు.. అటు నుంచి అటే జంప్‌ అయ్యారు. రూ.3 లక్షల 50 వేల నగదు, దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో వెళ్లిపోయారు. దాంతో రెండు కుటుంబాల వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

దీంతో అల్లుడితో పారిపోయిన మహిళ భర్త లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిద్దరి ఆచుకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. యూపీలోని అలీఘర్‌లో అత్త, అల్లుడు పారిపోయిన ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు వారు ఎక్కడ ఉన్నారో కనుగొన్నారు. ఇద్దరూ అలీఘర్ నుండి 200 కి.మీ దూరంలో ఉన్నట్లు గుర్తించి.. వారిని పట్టుకోవడానికి పోలీసులు ఆ ప్రదేశానికి బయలుదేరారు.

అత్త, అల్లుడు ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో దాక్కున్నట్లు పేర్కొన్నారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఉన్న రుద్రపూర్, అలీఘర్ నుండి 206 కి.మీ దూరంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. వరుడు రాహుల్ గతంలో రుద్రపూర్‌లో పనిచేసేవాడని.. అటువంటి పరిస్థితిలో, వారిద్దరూ అలీఘర్ నుంచి పారిపోయి అక్కడికి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు.

ఎంగేజ్‌మెంట్ అయిన మూడు నెలల నుంచి..

మాండ్రాక్ ప్రాంతంలోని మనోహర్‌పూర్ గ్రామంలో నివసించే జితేంద్ర కుమార్ తన కుమార్తె శివానిని.. థానా చర్రా ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడితో నిశ్చయించాడు. అతని వివాహం ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా.. ఈ ఘటన జరిగింది.. ఎంగేజ్‌మెంట్ అనంతరం వధువు తల్లికి, కాబోయే వరుడికి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైందని పోలీసులు తెలిపారు. పెళ్లి కార్డులు కూడా పంచిపెట్టాక.. అల్లుడు, అత్త పారిపోవడంతో ఇరు కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. ఈ ఘటన అనంతరం వధువు షాకింగ్ విషయాలను వెల్లడించింది.. వారిద్దరూ 22 గంటలు మాట్లాడుకునేవారంటూ చెప్పింది.. రాహుల్ తనతో అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడేవాడని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us