ఎన్నాళ్లకెన్నాళ్లకు ! మళ్ళీ అమ్మ ఒడి చేరిన చిన్నారి చంపక్

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వారణాసిలో ఇతర ఆందోళనకారులతో కలిసి నిరసన తెలిపిన యాక్టివిస్టులు ఏక్తా, ఆమె భర్త రవి శేఖర్ లకు బెయిలు లభించింది. డిసెంబరు 19 న వీరిని వారణాసి పోలీసులు అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. సుమారు రెండు వారాల అనంతరం వీరికి బెయిలు లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇన్ని రోజుల అనంతరం ఈ దంపతుల 14 నెలల పసిపాప చంపక్ (ఆర్య) మళ్ళీ తన తలిదండ్రులను కలుసుకోగలిగింది. తల్లిని చూసి […]

ఎన్నాళ్లకెన్నాళ్లకు ! మళ్ళీ అమ్మ ఒడి చేరిన చిన్నారి చంపక్
Follow us

|

Updated on: Jan 02, 2020 | 11:24 AM

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వారణాసిలో ఇతర ఆందోళనకారులతో కలిసి నిరసన తెలిపిన యాక్టివిస్టులు ఏక్తా, ఆమె భర్త రవి శేఖర్ లకు బెయిలు లభించింది. డిసెంబరు 19 న వీరిని వారణాసి పోలీసులు అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. సుమారు రెండు వారాల అనంతరం వీరికి బెయిలు లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇన్ని రోజుల అనంతరం ఈ దంపతుల 14 నెలల పసిపాప చంపక్ (ఆర్య) మళ్ళీ తన తలిదండ్రులను కలుసుకోగలిగింది. తల్లిని చూసి ఆ పాప బోసినవ్వులు నవ్వుతుండగా ఆ తల్లి మురిసిపోయింది.

ఈ భార్యాభర్తలతో బాటు బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన దాదాపు పన్నెండు మంది విద్యార్థులకు కూడా బెయిలు లభించింది. ఏక్తాను, ఆమె భర్తను జైలునుంచి రిలీజ్ చేయాలంటూ చంపక్ అమ్మమ్మ ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకొని ఓ లేఖను అందజేసిన సంగతి తెలిసిందే.. తల్లి కోసం చంపక్ ఎంతో బెంగ పెట్టుకుని అనారోగ్యం బారిన పడుతోందని ఆమె ఈ లేఖలో పేర్కొంది. బహుశా ప్రధాని మోదీ ఆదేశాలతో వారణాసిలోని జైలు అధికారులు స్పందించి ఈ దంపతులను, కొందరు విద్యార్థులను విడుదల చేసినట్టు తెలుస్తోంది. అటువీరి తరఫు లాయర్లు కూడా బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా-వాయు కాలుష్యంపై ‘ క్లైమేట్ ఎజెండా ‘ పేరిట ఏక్తా దంపతులు ఓ ఎన్జీఓ ను నిర్వహిస్తున్నారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు