లిక్కర్ కింగ్‌కు ఝలక్ ఇచ్చిన స్పెషల్ కోర్టు.. ఇక అవన్నీ అంతేనా..?
లిక్కర్ కింగ్ అంటేచాలు.. చటుక్కున గుర్తొచ్చేది విజయ్ మాల్యానే. ఎందుకంటే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటుగా.. లిక్కర్‌లో కూడా బ్రాండ్‌ను మెయిన్‌టైన్ చేశాడు. అయితే ఆ తర్వాత లగ్జరీ లైఫ్‌తో జల్సాలు చేస్తూ.. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి.. ఇండియా నుంచి విదేశాలకు పారిపోయాడు. అయితే వేల కోట్ల విలువగల ఆయన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడే ఉండిపోయాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి జల్సా చేస్తున్న మాల్యాకు.. ముంబై స్పెషల్ కోర్టు దిమ్మదిరిగే షాక్ […]
లిక్కర్ కింగ్ అంటేచాలు.. చటుక్కున గుర్తొచ్చేది విజయ్ మాల్యానే. ఎందుకంటే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటుగా.. లిక్కర్‌లో కూడా బ్రాండ్‌ను మెయిన్‌టైన్ చేశాడు. అయితే ఆ తర్వాత లగ్జరీ లైఫ్‌తో జల్సాలు చేస్తూ.. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి.. ఇండియా నుంచి విదేశాలకు పారిపోయాడు. అయితే వేల కోట్ల విలువగల ఆయన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడే ఉండిపోయాయి.
ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి జల్సా చేస్తున్న మాల్యాకు.. ముంబై స్పెషల్ కోర్టు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్ అమ్ముకొని, అతడి పేరుమీదున్న రుణాలను క్లియర్ చేసుకోవచ్చని బ్యాంకులకు తెలిపింది. ఈ మేరకు.. మొత్తం 15 బ్యాంకులకు స్పెషల్ కోర్టు సూచించింది. యునైటెడ్ బ్రెవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన షేర్లన్నీ.. మనీల్యాండరింగ్ కేసులో అటాచ్ అయిఉన్నాయి. కాగా రుణాలు ఎగ్గొట్టిన కేసులో విజయ్ మాల్యాను దోషిగా తేల్చారు. అతడిపై వారెంట్ జారీ చేసినా.. ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో స్పెషల్ కోర్టు.. యూబీ షేర్లను అమ్ముకోవచ్చంటూ తీర్పునిచ్చింది. అంతేకాదు మాల్యా చరాస్థులపై ఉన్న అటాచ్‌మెంట్‌ను ఎత్తివేసినట్లు బ్యాంకుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ పాటిల్ తెలిపారు. దీంతో.. రూ.13 వేల కోట్ల విలువైన ఆస్తులను ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం వేలం వేయనుంది. అయితే ఈ ఆదేశాలను జనవరి 18 తర్వాతే పాటించాలని కోర్టు సూచించింది. ఇక దీని సంబంధిత పార్టీలు.. వేలం ఆదేశాలపై ముంబై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.