ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్‌‌ చేసుకుంటే.. రూ. 4లక్షల కవరేజ్.. ఇంకా…

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మొన్నటి వరకు విపరీతంగా టారీఫ్ రేట్లను పెంచిన సంస్థ.. ఇక వినియోగదారుల శ్రేయస్సు కొరకు ప్రయత్నాలు ఆరంభించింది. వినియోగదారులు ఎయిర్‌టెల్‌ను విడవకుండా.. వారిని ఆకర్షించేందుకు రీఛార్జ్‌లతో పాటుగా ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందుకోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను తీసుకోస్తోంది. రూ. 279, రూ. 379 ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది. ఈ రీఛార్జ్‌లో ఆన్‌లిమిటెడ్‌ అవుట్ గోయింగ్ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అంతేకాదు.. […]

ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్‌‌ చేసుకుంటే.. రూ. 4లక్షల కవరేజ్.. ఇంకా...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 03, 2020 | 2:34 AM

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మొన్నటి వరకు విపరీతంగా టారీఫ్ రేట్లను పెంచిన సంస్థ.. ఇక వినియోగదారుల శ్రేయస్సు కొరకు ప్రయత్నాలు ఆరంభించింది. వినియోగదారులు ఎయిర్‌టెల్‌ను విడవకుండా.. వారిని ఆకర్షించేందుకు రీఛార్జ్‌లతో పాటుగా ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందుకోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను తీసుకోస్తోంది. రూ. 279, రూ. 379 ప్లాన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.

ఈ రీఛార్జ్‌లో ఆన్‌లిమిటెడ్‌ అవుట్ గోయింగ్ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అంతేకాదు.. వీటితోపాటుగా పలు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్ కూడా అందిస్తోంది. ఇందులో రూ. 279 రిఛార్జ్‌ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. ఈ ప్యాక్‌ గడువు 28 రోజులని తెలిపింది. దీనికి తోడుగా.. రూ. 4 లక్షల జీవిత బీమాను కూడా అందిస్తోంది.

అలాగే రూ. 379 రీచార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ అవుట్ గోయింగ్ కాల్స్‌‌తో పాటు.. 6 జీబీ డేటా, 900 ఎస్‌ఎంఎస్‌లు పొదవచ్చు. ఈ టారీఫ్ ప్లాన్‌ గడువు 84 రోజులు ఉంటుంది. అంతేకాదు.. ఈ రూ.379 రీచార్జ్‌ చేసుకున్న కస్టమర్.. ఫాస్టాగ్‌ కొనుగోలుపై రూ.100 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. వీటితోపాటు వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌‌ను అందిస్తోంది.