బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? మీకిది శుభవార్త!
ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి భేష్ అంటున్నారు వ్యాపారులు. పసిడిపై పెట్టుబడులతో లాభాలే కానీ.. నష్టాలుండవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 సంవత్సరంలో బంగారంపై 23 శాతం లాభాలు లభించాయంటే.. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 2019లో ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర 42 వేలు దాటి రికార్డు సృష్టించింది. అనంతరం కొంత హెచ్చుతగ్గులకు లోనైనా.. తాజాగా న్యూయర్ రోజున మళ్లీ తేదీన 40 వేలు దాటింది. డాలర్ టర్మ్స్‌లో ఔన్స్ […]
ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి భేష్ అంటున్నారు వ్యాపారులు. పసిడిపై పెట్టుబడులతో లాభాలే కానీ.. నష్టాలుండవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 సంవత్సరంలో బంగారంపై 23 శాతం లాభాలు లభించాయంటే.. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
2019లో ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర 42 వేలు దాటి రికార్డు సృష్టించింది. అనంతరం కొంత హెచ్చుతగ్గులకు లోనైనా.. తాజాగా న్యూయర్ రోజున మళ్లీ తేదీన 40 వేలు దాటింది. డాలర్ టర్మ్స్‌లో ఔన్స్ డాలర్లకు చేరింది. దీంతో ఈ సంవత్సరం కూడా బంగారం ధర పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.10 గ్రాముల బంగారం 45 వేలు దాటుతుందని వారు భావిస్తున్నారు. అయితే.. బంగారాన్ని ఫిజికల్‌గా కంటే.. ఈక్విటీ షేర్స్ రూపంలో కానీ.. ప్రభుత్వం జారీ చేసిన ఎంఎంటీసీ గోల్డ్ కాయిన్స్ రూపంలో పెట్టడం మంచిది.
గత కొద్ది రోజుల నుంచి పెరుగుతోన్న పసిడి ధరలు మాత్రం అందర్నీ షాక్‌కి గురిచేస్తోన్నాయి. బంగారం కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. రోజు రోజుకూ ధరలు పెరిగి కొండెక్కి కూర్చొంటున్నాయి. వచ్చే వారం తగ్గుతుంది.. లేక వచ్చే నెలలో తగ్గుతాయని భావించిన వారికి నిరాశే మిగులుతోంది. అయితే.. ఈ ఏడాది జోరును కనబర్చిన బంగారం.. వచ్చే ఏడాది 2020లో కూడా అదే స్థాయిలో ఉండొచ్చని వివిధ రీసెర్చ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.
కాగా శుక్రవారం.. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 41,150లుగా ఉంది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాములు రూ. 37,930గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24కే 10 గ్రాములు 39,100లుగా ఉంది. 22కే 10 గ్రాములు రూ. 38,100గా ఉంది.