Smriti Irani: వివాదం వేరే లెవల్‌కు.. కాంగ్రెస్‌ నేతలకు షాకిచ్చిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ..!

Smriti Irani: తమపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ షాక్ ఇచ్చారు. ఏకంగా నోటీసులు పంపడంతో.. ఈ వివాదం వేరే లెవల్‌కి వెళ్లింది. స్మృతీ ఇరానీ కూతురు అయిన..

Smriti Irani: వివాదం వేరే లెవల్‌కు.. కాంగ్రెస్‌ నేతలకు షాకిచ్చిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ..!
Smriti Irani
Follow us
TV9 Telugu

| Edited By: Subhash Goud

Updated on: Jul 25, 2022 | 8:13 AM

Smriti Irani: తమపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ షాక్ ఇచ్చారు. ఏకంగా నోటీసులు పంపడంతో.. ఈ వివాదం వేరే లెవల్‌కి వెళ్లింది. స్మృతీ ఇరానీ కూతురు అయిన జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్‌ నడుపుతున్నారంటూ ఇటీవల తీవ్ర వివాదం చెలరేగింది. ఈ విషయమై బహిరంగంగానే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. దీంతో లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమయ్యారు. ముగ్గురు కాంగ్రెస్‌ నేతలైన పవన్‌ ఖేరా, జైరాం రమేష్‌, నెట్టా డిసౌజాలకు లీగల్‌ నోటీసులు పంపారు. వెంటనే కుతూరుపై చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే లోకల్ యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ బివి శ్రీనివాస్‌.. ఆ బార్‌కు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో బార్‌ను దాచిపెడుతూ ఉన్న టేప్‌ను పోలీసుల సమక్షంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు తొలగించడం కొసమెరుపు.

కాగా, స్మృతి కుమార్తె నడుపుతున్న రెస్టారెంట్‌ లైసెన్స్‌ను గత ఏడాది మే నెలలో మృతి చెందిన ఓ వ్యక్తి పేరు మీద ఈ ఏడాది జూన్‌లోలో తీసుకున్నారు. గత 13 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద లైసెన్స్‌ ఎలా తీసుకుంటారన్నది తలెత్తుతున్న ప్రశ్న. ఇది ముమ్మాటికి అక్రమమే అని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. గోవా నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్‌కు ఒక బార్‌ లైసెన్స్‌ మాత్రమే ఉండాలి. ఎక్కవుగా ఉండేందుకు అవకాశం ఉండదు. కానీ.. సిల్లీ సోల్స్‌ గోవా రెస్టారెంట్‌ పేరిట రెండు బార్‌ లైసెన్సులున్నాయని కాంగ్రెస్ అంటోంది.

స్మృతి ఇరానీ ప్రమేయం లేకుండానే ఆమె కూతురు లైసెన్స్‌ పొందడం సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు. వెంటనే ప్రధాని మోదీ స్పందించి కేంద్రమంత్రిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. అయితే, ఈ అంశం దుమారం రేగడంతో స్మృతి ఇరానీ స్పందించారు. తన కూతురు స్టూడెంట్‌ అనీ, 18 సంవత్సరాల యువతి గౌరవాన్ని దిగజార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ అమ్మాయి తల్లి 2014, 2019లో రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేయడం. సోనియా, రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టడమే అంటూ ఘాటుగా స్పందించారు స్మృతీ ఇరానీ. ఇప్పుడు ఏకంగా న్యాయ పోరాటానికి దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి