AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santosh Gangwar: ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి.. కేంద్ర మంత్రి గంగ్వార్‌కు పాజిటివ్..

Covid-19 positive: దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా దాదాపుగా అందరూ కరోనా బారిన

Santosh Gangwar: ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి.. కేంద్ర మంత్రి గంగ్వార్‌కు పాజిటివ్..
Santosh Gangwar Anil Baluni
Shaik Madar Saheb
|

Updated on: Apr 13, 2021 | 3:07 PM

Share

Covid-19 positive: దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా దాదాపుగా అందరూ కరోనా బారిన పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ఇలా అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రికి, ఓ బీజేపీ ఎంపీకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ‌కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని గంగ్వార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు క‌రోనా పాజిటివ్ వచ్చిందని.. కానీ ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవంటూ వెల్లడించారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌ను క‌లిసిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ.. క‌లిసిక‌ట్టుగా మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధిద్దాం అంటూ గంగ్వార్ ట్విట్ చేశారు.

ఇదిలాఉంటే.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బాలూనీకి కూడా కరోనా సోకింది. మంగళవారం తాను కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని.. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నానంటూ ఎంపీ అనిల్ పేర్కొన్నారు. కరోనా సోకకుండా ప్రజలంతా అన్ని రకాల ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో తనను కలిసిన స్నేహితులు, పార్టీ కార్యకర్తలు నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తలు పాటించాలని ఎంపీ అనిల్ బాలూనీ సూచించారు.

కాగా.. గత 24 గంటల వ్యవధిలో సోమవారం దేశంలో కొత్తగా 1,61,736 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 879 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కి చేరగా.. మరణాల సంఖ్య 1,71,058కి పెరిగింది.

Also read:

హరిద్వార్ కుంభమేళకు పోటెత్తుతున్న జనాలు.. కొవిడ్‌ నిబంధనలు తుంగలోకి.. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Follow Us