Women’s Reservation Bill: రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. కొనసాగుతున్న చర్చ

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్‌ అధినియం బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయం రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వచ్చింది. అయితే అక్కడ సభ మొదలుకాగానే.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై సభలో చర్చ ప్రారంభమైంది. అయితే ఈ చర్చ జరిగిన అనంతరం బిల్లుపై ఓటింగ్‌‌ను నిర్వహిస్తారు.

Women’s Reservation Bill: రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. కొనసాగుతున్న చర్చ
Union Law Minister Arjun Ram Meghwal
Follow us
Aravind B

|

Updated on: Sep 21, 2023 | 3:07 PM

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్‌ అధినియం బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయం రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వచ్చింది. అయితే అక్కడ సభ మొదలుకాగానే.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై సభలో చర్చ ప్రారంభమైంది. అయితే ఈ చర్చ జరిగిన అనంతరం బిల్లుపై ఓటింగ్‌‌ను నిర్వహిస్తారు. అయితే.. ఈ బిల్లుకు విపక్ష సభ్యులు మద్దతు తెలుపడం వల్ల ఎగువ సభలో కూడా బిల్లు ఆమోదం పొందడం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ముద్రతో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 18న మొదలైన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 22 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈనెల 19న మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అలాగే 20వ తేదీన దీనిపై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌ నిర్వహించారు. అందులో మొత్తం 456 మంది ఎంపీల్లో 454 మంది అనుకూలంగా ఓటు వేయగా , ఇద్దరు ఎంఐఎం పార్టీకి చెందిన ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు అన్ని పార్టీలు రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా తమ ఓటు వేశాయి. మహిళా సాధికారత విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో ఈ బిల్లుకు దిగువ సభలో ఆమోద ముద్ర పడిపోయింది. అలాగే కొత్త పార్లమెంట్‌లో ఆమోదం పొందినటువంటి తొలి చారిత్రాత్మక బిల్లుగా ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లు నిలిచింది.

అయితే ప్రస్తుతం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌బిల్లుపై చర్చ కొనసాగుతోంది. మహిళా బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా సాధికారత కోసం మోదీ సర్కార్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని బీజేపీ ఎంపీ నడ్డా వెల్లడించగా, కాంగ్రెస్‌ కూడా మరెన్నో పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు విపక్షనేత మల్లికార్జున ఖర్గే. అలాగే మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌. ఇది నారీశక్తిని ముందుకు తీసుకెళ్లే గొప్ప ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు రాజ్యసభలో మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ జేపీ నడ్డా. ఈ 21 వ శతాబ్ధం మహిళలదేనని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..