Visa Services: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి వీసా సర్వీసులు బంద్
ఖలిస్థానీ అంశం భారత్, కెనడాల మధ్య దౌత్రపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిమాణం చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. భారత్‌కు వచ్చేటటువంటి కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. అయితే పలు నిర్వహణ కారణాల వల్ల కెనడాలో విసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే మళ్లీ తదుపరి నోటీసులు వచ్చేంతవరకు.. ఈ ఆదేశాలు అలాగే కొనసాగుతాయని పేర్కొన్నాయి.
ఖలిస్థానీ అంశం భారత్, కెనడాల మధ్య దౌత్రపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిమాణం చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. భారత్‌కు వచ్చేటటువంటి కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. అయితే పలు నిర్వహణ కారణాల వల్ల కెనడాలో విసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే మళ్లీ తదుపరి నోటీసులు వచ్చేంతవరకు.. ఈ ఆదేశాలు అలాగే కొనసాగుతాయని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ వార్తలపై కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. కెనడియన్ల విసా దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించే ఓ ప్రైవేటు ఏజెన్సీ మాత్రం ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్లో వెల్లడించింది. నిర్వహణ కారణాల వల్లే సెప్టెంబర్ 21 నుంచి వీసా సర్వీసులు సస్పెండ్ చేశారని.. తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.
ఇదిలా ఉండగా.. గతంలో ఖలిస్థాని సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య భారత్‌కు సంబంధం ఉందనడానికి మా వద్ద విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని.. కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో వ్యాఖ్యానించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారీ తీసింది. భారత్, కెనడాల మధ్య వివాదం రాజుకుంది. ఇలాంటి సమయంలో.. వీసా సర్వీసులను భారత్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ అంశం మరింత చర్చనీయాంగా మారింది. అయితే హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన విషయంలో.. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా.. అక్కడ ఉండే భారత్ దౌత్యవేత్తపై బహిష్యరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు.. ఆ తర్వాత మనదేశంలోని ఉన్నటువంటి కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. అంతేకాదు ఐదురోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ చెప్పింది.
మరోవైపు కెనడాలో హింసాత్మక ఘటనలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రవాస భారతీయులు.. అలాగే కెనడాకు పయనం అవ్వాలనుకునేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఓ అడ్వైజరిని కూడా జారీ చేసింది. ఇదిలా ఉండగా.. భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం రాజుకున్న వేళ.. మరో ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. మరో ఖలిస్థాని సానుభూతిపరుడు సుఖ్‌దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే హత్యకు గురైనట్లు సమాచారం. బుధవారం నాడు విన్నిపెగ్‌లో అతడు మృతి చెందినట్లు నిఘా వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే అతడి మరణంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ.. ఈ హత్య తామే చేసినట్లు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..