AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Students: భారతీయ వైద్య విద్యార్థులకు శుభవార్త.. ఇకనుంచి అక్కడ కూడా ప్రాక్టీస్‌ చేయొచ్చు

భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయవచ్చని పేర్కొంది. ఇందుకు సంబంధించి వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి జాతీయ వైద్యమండలికి.. రాబోయే 10 ఏళ్ల కాలానికి గుర్తింపు లభించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే దీనివల్ల భారత్‌లో వైద్య విద్య అభ్యసించిన వారు.. ఇక అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్‌ కూడా చేయొచ్చని తెలిపింది.

Medical Students: భారతీయ వైద్య విద్యార్థులకు శుభవార్త.. ఇకనుంచి అక్కడ కూడా ప్రాక్టీస్‌ చేయొచ్చు
Doctor
Aravind B
|

Updated on: Sep 21, 2023 | 3:38 PM

Share

భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయవచ్చని పేర్కొంది. ఇందుకు సంబంధించి వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి జాతీయ వైద్యమండలికి.. రాబోయే 10 ఏళ్ల కాలానికి గుర్తింపు లభించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే దీనివల్ల భారత్‌లో వైద్య విద్య అభ్యసించిన వారు.. ఇక అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్‌ కూడా చేయొచ్చని తెలిపింది. అలాగే 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో కూడా విద్య, ప్రాక్టీస్‌ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో ఉన్న, రాబోయే పది సంవత్సరాలలో ఏర్పాటు అయ్యేటటవంటి వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందుతాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ప్రస్తుతం ఇండియాలో 706 వరకు వైద్య కళాశాలలు ఉన్నాయి. ఈ వెసులుబాటు వల్ల భారతీయ మెడికల్ కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించనుంది. అంతేకాదు విదేశాల్లో ఉన్నటువంటి వైద్య విద్యాసంస్థలకు భారత్‌లో ఉన్న వైద్య కళాశాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు కూడా ఇది దోహదపడుతుంది. ఇండియాలో అందించేటటువంటి వైద్య విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందనేందుకు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు అనేది ఓ నిదర్శనం. దీంతో భారతీయ వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా కూడా అక్కడ తమ కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. విదేశీ విద్యార్థులను సైతం భారత వైద్య కళాశాలలు ఆకర్షిస్తాయని.. ఎన్‌ఎమ్‌సీ ప్రతినిధి డాక్టర్‌ యోగేందర్‌ మాలిక్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా.. అంతర్జాతీయంగా చూసుకుంటే.. అత్యున్నతస్థాయి ప్రమాణాలతో వైద్య విద్యను అందించడానికి డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ ఎంతో కృషి చేస్తోంది. అయితే ఈ డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు వరకు రుసుము వసూలు చేస్తోంది. దీనివల్ల దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం డబ్బులు చెల్లించనున్నాయి. దీంతో మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు కానుంది. ఇదిలా ఉండగా.. భారత్‌లో ఉన్నటువంటి వైద్య కళాశాలలకు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు వస్తుండటం మంచి పరిణామమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విదేశాల్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలకు.. ఇండియాలో ఉన్నటువంటి వైద్య కళాశాలల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. అలాగే వైద్య విద్యలో కొత్త ఆవిష్కరణాలు వస్తాయనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..