AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Startup Conclave 2023: కాంక్లేవ్ సన్నాహక సభలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్.. యూత్‌కి దిశా నిర్దేశం..

గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ IAS   సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. యునికార్న్స్ , వెంచర్ ఫండ్స్‌పై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రసంగం చేశారు. వ్యాపార రంగంలో రెండు ప్రధాన సూత్రాలున్నాయని.. ఆదాయం , లాభాలు అని చెప్పారు.. 

Startup Conclave 2023: కాంక్లేవ్ సన్నాహక సభలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్.. యూత్‌కి దిశా నిర్దేశం..
Startup Conclave 2023
Surya Kala
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 07, 2023 | 8:13 AM

Share

కొత్త ఏడాది జనవరి నెలలో జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ (VGGS)కి ముందు.. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ నగర్ వేదికగా నేడు “స్టార్టప్ కాంక్లేవ్ 2023” ని నిర్వహించనుంది. ఈ కాంక్లేవ్‌లో గుజరాత్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యూనికార్న్ స్టార్టప్‌ ప్రతినిధులు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు పాల్గొననున్నారు. అయితే ఈ “స్టార్టప్ కాంక్లేవ్ 2023″కి సన్నాహకంగా గుజరాత్ ప్రభుత్వం యునికార్న్స్ , వెంచర్ ఫండ్స్‌పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని బుధవారం నిర్వహించింది.

గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ IAS  సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. యునికార్న్స్ , వెంచర్ ఫండ్స్‌పై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రసంగం చేశారు. వ్యాపార రంగంలో రెండు ప్రధాన సూత్రాలున్నాయని.. ఆదాయం, లాభాలు అని చెప్పారు..  ఓటమితో ఆగిపోవద్దని.. గెలుపుకి బాట వేసుకోవాలని మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్ కు అమృత సమయం నడుస్తోందని.. మన దేశంలో యువతకు చేయి అందిస్తే సరికొత్త ఆలోచనలనతో సంచలనాలు సృష్టిస్తారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

స్టార్టప్‌లకు మరింత అనువైన, అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి, రెగ్యులేటరీ సంస్కరణలు, పన్ను ప్రోత్సాహకాలు, సమ్మతి పరంగా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంపై కాంక్లేవ్ దృష్టి సారిస్తుందని తెలిపారు.

‘వైబ్రంట్ గుజరాత్’ పేరుతో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యానికి పేరుగాంచిందని.. రానున్న కాంక్లేవ్  లో దేశంతో పాటు ముఖ్యంగా గుజరాత్‌లో వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల స్థితి సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధన, మార్కెటింగ్ రంగంలో ప్రగతి, నిధుల సేకరణ, ఆర్థిక చేరికలు, స్టార్టప్‌లకు సంబంధించిన సవాళ్లను కూడా ఈ కాంక్లేవ్ అన్వేషిస్తుందని చెప్పారు.

కాంక్లేవ్ 2023లో ఆలోచనలను ఒకరితోనొకరు పంచుకుంటూ.. సరికొత్త అవకాశాలను అన్వేషించడానికి, కొత్త మార్గాలను సృష్టించడానికి స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, ఏంజెల్ నెట్‌వర్క్‌లను ఒకచోట చేర్చుతుందని  చెప్పారు. మొత్తానికి దేశాన్ని మూడవ అతిపెద్ద గ్లోబల్ స్టార్టప్ ఎకో-సిస్టమ్‌గా మార్చడం”పై ఒక సెషన్ దృష్టి సారిస్తుందని .. ఈ కాన్క్లేవ్‌లోని ఓ సెక్షన్ లో భారతదేశ స్టార్టప్‌ల సక్సెస్ స్టోరీలను పంచుకుంటూ.. సక్సెస్ ను జరుపుకోనున్నారని పటేల్ చెప్పారు.

ప్రముఖ యునికార్న్స్ , వెంచర్ క్యాపిటల్స్ ప్రతినిధులు, గ్లోబల్ బీస్‌కు చెందిన నితిన్ అగర్వాల్, APNA  నిర్మిత్ పారిఖ్, ఓపెన్ బ్యాంక్‌కు చెందిన మాబెల్ చాకో, ఫార్మ్ ఈజీకి చెందిన ధర్మిల్ షేత్, ప్రిస్టిన్ కేర్‌కు చెందిన గరిమా సాహ్నీ, మొబిక్విక్‌కి చెందిన ఉపాసనా టాకు , పాలిక్ బజార్, రాజీవ్ బజార్ , స్పిన్నీకి చెందిన నీరాజ్ సింగ్, స్ట్రైడ్ వెంచర్స్ (VC)కి చెందిన రవ్‌నీత్ మన్ .. ఇతరులు స్టార్టప్ ఎకోసిస్టమ్ కి చెందిన వివిధ అంశాలను కవర్ చేసే విధంగా వివిధ చర్చలలో పాల్గొంటారు.

DPIIT- స్టార్టప్ ఇండియా వినూత్న విజయ గాథలు

ఇప్పటి వరకూ భారతదేశం 108 యునికార్న్‌లను కలిగి ఉంది. దీని మొత్తం విలువ సుమారు 340.80 బిలియన్ డాలర్లు. 2011లో తొలి భారత యునికార్న్ ఆవిర్భవించిందని.. 2022 నాటికి భారత్ 100 యునికార్న్ మైలురాయిని సాధించిందని మంత్రి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..