AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ujjwala Scheme 2: మోదీ ప్రభుత్వం మరో కానుక.. 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు..

Ujjwala Scheme 2: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 75 లక్షల మంది మహిళల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉజ్వల పథకం రెండో దశకు ఆమోదం తెలిపింది. దీని కింద కొత్తగా 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం 9.60 కోట్ల మంది మహిళలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్త ఉచిత LPG కనెక్షన్ల పంపిణీ తర్వాత, లబ్దిదారుల సంఖ్య 10 కోట్లు దాటుతుంది.

Ujjwala Scheme 2: మోదీ ప్రభుత్వం మరో కానుక.. 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు..
Lpg Gas
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 14, 2023 | 10:07 AM

Share

Ujjwala Scheme 2: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 75 లక్షల మంది మహిళల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉజ్వల పథకం రెండో దశకు ఆమోదం తెలిపింది. దీని కింద కొత్తగా 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం 9.60 కోట్ల మంది మహిళలు ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్త ఉచిత LPG కనెక్షన్ల పంపిణీ తర్వాత, లబ్దిదారుల సంఖ్య 10 కోట్లు దాటుతుంది.

ఉజ్వల పథకం మోడీ ప్రభుత్వ ప్రధాన పథకాలలో ఒకటి. దేశవ్యాప్తంగా వెనుకబడిన, పేద వర్గాల మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. ఉజ్వల పథకంలోని మహిళా లబ్ధిదారులకు, ఈ తగ్గింపు మొత్తం రూ.400కి తగ్గించబడింది.

ప్రతి మహిళకు రూ.2,200 సబ్సిడీ లభిస్తుంది..

రానున్న మూడేళ్లలో ఈ 75 లక్షల కనెక్షన్లు పంపిణీ చేస్తామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉజ్వల పథకం కింద, ఉచిత LPG గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌పై ప్రతి కనెక్షన్‌కు ప్రభుత్వం 2,200 రూపాయల సబ్సిడీని ఇస్తుంది. ఇందుకు ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.1,650 కోట్లు వెచ్చించనున్నారు. మొదటి సిలిండర్‌ను ఉచితంగా నింపడంతోపాటు ఉచితంగా గ్యాస్‌ స్టవ్‌ను అందించడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని పెట్రోలియం కంపెనీలు భరిస్తాయి.

వంట చెఱకు పొగ నుంచి స్త్రీలకు విముక్తి..

ఉజ్వల పథకం విస్తరణను ప్రకటించిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్.. ప్రస్తుతం బొగ్గు పొయ్యి, కట్టెల పొయ్యిపై ఆహారం వండే మహిళలకు దీని ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయని అన్నారు. ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. పొగ నుండి విముక్తిని ఇస్తుందన్నారు. పర్యావరణ దృక్కోణంలో కూడా ఈ నిర్ణయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

ఈ ప్రయోజనాలు ఉజ్వల పథకంలో అందుబాటులో ఉన్నాయి..

మోదీ ప్రభుత్వం 2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. అనంతరం 5 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత ఈ లక్ష్యాన్ని 8 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద, పేద మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు సబ్సిడీ ధరలకు సిలిండర్లను అందివ్వడం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..