Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా పాలిటిక్స్‌లో సూపర్ సీన్.. 20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు.. వీడియో వైరల్

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల తర్వాత అన్నదమ్ములిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. దీంతో వారి అభిమానులు ఫుల్ ఖుషీ అవతున్నారు. అంతేకాకుండా వారు ఒకరినొకరు అప్యాయంగా హగ్ చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మహా పాలిటిక్స్‌లో సూపర్ సీన్.. 20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు.. వీడియో వైరల్
Uddhav Thackeray
Krishna S
|

Updated on: Jul 05, 2025 | 2:46 PM

Share

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు నెలకొంటున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. అంతేకాకుండా ఒకొరిని ఒకరు హగ్ చేసుకోవడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆ అన్నదమ్ములు ఎవరు అనుకుంటున్నారా..? ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే. 2005లో చివరిసారిగా ఒకే వేదికపై కలిసి కనిపించిన ఈ ఇద్దరూ.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కనిపించారు. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిశారు. దీంతో బాల్ థాక్రే అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో హిందీ భాషను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని బోధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్దవ్, రాజ్ సంయుక్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ముంబై పట్టణంలోని వర్లీలో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.

రాజ్ థాక్రే వేదిక మీదకు రాగానే ఉద్ధవ్ వెళ్లి ఆయన్ని హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వెళ్లి పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. ఇది చూసిన అక్కడున్నవారంత చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై రాజ్ థాక్రే తీవ్ర విమర్శలు చేశారు. బాల్ థాక్రే చేయలేనిది.. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారంటూ సెటైర్లు వేశారు. ‘‘20ఏళ్ల తర్వాత మేం కలిశాం. బాల్ థాక్రే మమ్మల్ని కలపలేకపోయారు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ తాను తీసుకున్న నిర్ణయంతో మమ్మల్ని కలిపారు’’ అని వ్యాఖ్యానించారు. తాము హిందీకి వ్యతిరేకం కాదని.. కానీ భాష కోసం ప్రజలను బలవంతం పెట్టకూడదని చెప్పారు. గతంలో మరాఠా పాలకులు ఎన్నో ప్రాంతాలు పాలించారు. కానీ మరాఠాను ఆయా ప్రాంతాలపై మీద రుద్దలేదని గుర్తు చేశారు. మరాఠీ భాష, మరాఠ ప్రజల సమస్యలపై పోరాడడంలో వెనకాడబోమని స్పష్టం చేశారు.

కాగా 2005లో మాల్వాన్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకే రాజ్ థాక్రే పార్టీని వీడారు. నేను కోరుకుంది గౌరవం.. కానీ నాకు దక్కింది అవమానమంటూ రాజ్ థాక్రే శివసేనకు రాజీనామా చేశారు. 2003లో ఉద్దవ్ థాక్రేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం కూడా రాజ్ థాక్రేకు నచ్చలేదు. ఎట్టకేలకు ఈ అన్నదమ్మలిద్దరు మళ్లీ కలవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..