Watch Video: ఛీ.. ఛీ ఇవేం వికృత చేష్టలు.. నడిరోడ్డుపై కారు డోర్ తెరిచి ఏం చేశాడంటే..
ఈ మధ్య కాలంలో యువత బరితగించి ప్రవర్తిస్తున్నారు. ప్రైవేట్ ప్లేస్‌లో ఉన్నామా.. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నామా అని కూడా అలోచించకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. ఒక యువకుడు కారులో వెళ్తూ నడిరోడ్డు కారు డోర్ ఓపెన్ చేసి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నడిరోడ్డుపై రన్నింగ్ కార్ డోర్ ఓపెన్ చేసి ఓ యువకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరి యువకులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌కు చెందిన ఇద్దరు యువకులు.. సదర్ బజార్ ప్రాంతంలో మహీంద్రా థార్ కారులో వెళ్తున్నారు. అయితే డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న ఒక యువకుడు కారు రన్నింగ్‌లో ఉండగా దాని డోర్ తెరిచి సైడ్ స్టెప్ మీద నిల్చొని మూత్ర విసర్జన చేశాడు. వెనకాలే వస్తున్న మరో కారులోని ప్రయాణికులు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో క్షణాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనం నడుపుతున్న మోహిత్ (23)తో పాటు మూత్ర విసర్జన చేసిన అనుజ్ 25 అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి కారును స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై గురుగ్రామ్ పోలీస్ ప్రతినిధి సందీప్ కుమార్ మాట్లాడుతూ.. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపిన మోహిత్‌కు నేర చరిత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్టు ఆయన తెలిపారు. రాజస్థాన్‌లో అతని హత్య కేసు, హర్యానాలో రెండు ఘర్షణ కేసులు ఉన్నాయని తెలపారు. ఈ కేసుల్లో అప్పుడు అరెస్టైన మోహిత్ 2022లో జైలు నుంచి విడుదలైనట్టు తెలిపారు.
వీడియో చూడండి..
गुरुग्राम में चलती थार से पेशाब किया, मोहित और अनुज गिरफ्तार !!
मोहित गाड़ी चला रहा था, अनुज ने पेशाब किया। pic.twitter.com/Bmbe5orKG7
— Sachin Gupta (@SachinGuptaUP) October 24, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
