హోలీ వేళ.. కశ్మీర్‌లో ఉగ్రవేట.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

దేశ వ్యాప్తంగా ఓ వైపు హోలీ సంబరాలు జరుపుకుంటుంటే.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులకోసం గాలింపు జరుపుతుండగా.. భద్రతాబలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ఎదురుకాల్పులు ప్రారంభించారు. […]

హోలీ వేళ.. కశ్మీర్‌లో ఉగ్రవేట.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2020 | 1:45 PM

దేశ వ్యాప్తంగా ఓ వైపు హోలీ సంబరాలు జరుపుకుంటుంటే.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులకోసం గాలింపు జరుపుతుండగా.. భద్రతాబలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. మరికొందరు ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నారు.