ఎస్ బ్యాంకులో మావి పెట్టుబడులు మాత్రమే.. ఎస్ బీ ఐ చైర్మన్ రజనీష్ కుమార్
సంక్షోభానికి గురైన ఎస్ బ్యాంకులో తమవి పెట్టుబడులు మాత్రమేనని, అంతేగానీ దీన్ని టేకోవర్ చేయడం గానీ, తమ బ్యాంకులో విలీనం చేసుకోవడమో గానీ కాదని ఎస్ బీ ఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ బ్యాంకులో మేము పెట్టుబడులు మాత్రమే పెడుతున్నాం.
సంక్షోభానికి గురైన ఎస్ బ్యాంకులో తమవి పెట్టుబడులు మాత్రమేనని, అంతేగానీ దీన్ని టేకోవర్ చేయడం గానీ, తమ బ్యాంకులో విలీనం చేసుకోవడమో గానీ కాదని ఎస్ బీ ఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ బ్యాంకులో మేము పెట్టుబడులు మాత్రమే పెడుతున్నాం.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు 26 శాతం నుంచి 49 శాతం వరకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అని ఆయన వివరించారు. మూడేళ్ళ పాటు కనీసం 26 శాతం పెట్టుబడులు ఉంటాయని, ఆ తరువాత ఇవి 49 శాతానికి పెరుగుతాయని ఆయన చెప్పారు. స్కామ్ కు గురైన ఎస్ బ్యాంకును పునరుజ్జీవింప జేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఓ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచడానికి గట్టి చర్యలు తీసుకోవాలని అనేకమంది తమ బ్యాంకును కోరినట్టు రజనీష్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఎస్ బ్యాంకుకు ఈయన అడ్మినిస్ట్రేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యాంకుకు తాము ఎండీని, సీఈఓ ను నియమిస్తామని, బ్యాంక్ బోర్డులో తమ బ్యాంకుకు చెందిన ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ బ్యాంక్ షేర్ల డైల్యూషన్ ని మేం నివారించలేం.. సుమారు 254 కోట్ల షేర్ల డైల్యూషన్ మా చేతుల్లో లేదు అని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ తనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు ఒక దశలో కంట తడి పెట్టారు. ముంబైలో ఈయనకు చెందిన మొత్తం ఏడు కార్యాలయాలు, సంస్థల మీద ఈడీ అధికారులు రైడ్స్ ప్రారంభించారు. ఈయనకు, దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు మధ్య నడిచిన ఆర్ధిక లావాదేవీలపైన, క్విడ్ ప్రోకో కింద రానా కుటుంబం పొందిన ప్రయోజనాలపైన ఈడీ సమగ్రంగా విచారిస్తోంది.