AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసిస్‌తో లింక్…. ఢిల్లీలో కపుల్ అరెస్ట్…

ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో లింక్ కొనసాగిస్తున్న భార్యాభర్తల జంటను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్ కి అనుబంధంగా ఉందని భావిస్తున్న 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఖొరసాన్' అనే మరో సంస్థతో కూడా టచ్ లో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

ఐసిస్‌తో లింక్.... ఢిల్లీలో కపుల్ అరెస్ట్...
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 09, 2020 | 2:44 PM

Share

ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో లింక్ కొనసాగిస్తున్న భార్యాభర్తల జంటను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్‌కి అనుబంధంగా ఉందని భావిస్తున్న ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఖొరసాన్’ అనే మరో సంస్థతో కూడా టచ్‌లో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. సౌత్ ఢిల్లీలోని జామియానగర్ లో ఓ మారుమూల ఇంట్లోఉన్న వీరు తమ గుట్టు బయటపడకుండా రహస్యంగా జీవిస్తున్నట్టు తెలిసింది. 36 ఏళ్ళ జెహాన్ జబ్ సమి, 39 ఏళ్ళ అతని భార్య హీనా బషీర్ బేగ్.. ఇద్దరూ ఢిల్లీ నగరంలో సీఏఏ వ్యతిరేక అల్లర్లను రెచ్ఛగొట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సాధనాలతో ఈ జంట.. ముస్లిం యువతను ఐసిస్‌కి అనుకూలంగా మార్చేందుకు యత్నించారని, వీరి ఇంటి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ను, హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నామని ఖాకీలు పేర్కొన్నారు. వీరు పలువురు సీనియర్ ఐసిస్ సభ్యులతోను, ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లతోను నిత్యం కాంటాక్టులో ఉండేవారట.. సీఏఏ అన్నది బ్లాక్ లా అని, దీనివల్ల ముస్లిములకు హాని కలుగుతుందని రాసి ఉన్న ఆర్టికల్స్ కూడా తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని సమర్థిస్తున్నవారు ముస్లిములకు శత్రువులని వీరు ప్రచారం చేస్తూ వచ్చారట. ఢిల్లీలో ఉగ్రదాడులు జరిపేందుకు ఈ జంట ప్లాన్ లు వేసిందని, ఇందులో భాగంగా ఐసిస్ మ్యాగజైన్ ‘సాత్ అల్-హింద్’ కి వ్యాసాలు రాసిందని తెలుస్తోంది. తరచూ జమ్మూ కాశ్మీర్ కి వెళ్లి వచ్ఛే ఈ కపుల్ పట్టుబడతారని తాము కూడా ఊహించలేదని పోలీసులు తెలిపారు.

Follow Us
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?
వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?
14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..
14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..
తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!
తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..
సమోసా, బజ్జీ కొనేటప్పుడు ఈ ఒక్క విషయం గమనించకపోతే నష్టమే..
సమోసా, బజ్జీ కొనేటప్పుడు ఈ ఒక్క విషయం గమనించకపోతే నష్టమే..