Lenin Movie: లెనిన్‌లో భాగ్యశ్రీ అక్క పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? తెలుగులో క్రేజీ హీరోయిన్..
ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతున్న చిత్రాల్లో లెనిన్ ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో నటించిన ఓ అమ్మడు స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు.

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద థియేటర్లలో సూపర్ రన్ అవుతోంది. ఈ సినిమాలో అఖిల్ పర్ఫార్మెన్స్, హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సే నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొదటి రోజే ఈ చిత్రం రూ.16.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. ఇక ఇప్పుడు శనివారం, ఆదివారాల్లో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీవిశ్లేషకుల. చాలా కాలం తర్వాత అఖిల్ ఖాతాలో మొదటి సారి సాలిడ్ హిట్ పడింది. శనివారం ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ, కథను ఊహించని మలుపులు తిప్పిన ఒక కీలక పాత్ర ఉంది. అదే హీరోయిన్ అక్క ‘వైదేహి’ క్యారెక్టర్!
ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
సినిమా చూసి థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ఆడియన్స్ అంతా.. ఆ వైదేహి పాత్రలో నటించిన అమ్మాయి ఎవరబ్బా అని గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌తో సినిమాలో వచ్చే రెండు పెద్ద ట్విస్ట్‌లు ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇంతకీ ఈ వైదేహి పాత్రలో నటించిన బ్యూటీ ఎవరో తెలుసా. ఆమె మరెవరో కాదు.. పక్కా తెలుగమ్మాయి శ్రావణి కృష్ణవేణి రెడ్డి గుంతబిల్లు. శ్రావణి కెరీర్ తొలినాళ్లలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన టాలెంట్ నిరూపించుకుంది. ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఆడిషన్స్ ఇస్తూ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే గతేడాది విడుదలైన ‘లవ్ రెడ్డి’ సినిమాలో హీరోయిన్‌గా నటించి, తన ఎమోషనల్ యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
ఇప్పుడు ‘లెనిన్’ సినిమాలో కేవలం హీరోయిన్ అక్కగానే కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న ‘గువ్వల చెరువు ఘాట్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా శ్రావణి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. లెనిన్ సినిమాలో ఈమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అలాగే పవర్‌ఫుల్ సపోర్టింగ్ రోల్స్‌కు ఈ తెలుగమ్మాయి బెస్ట్ ఛాయిస్ కాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమా సక్సెస్‌తో ఎంజాయ్ చేస్తున్న శ్రావణి, షూటింగ్ సెట్స్ కి సంబంధించిన కొన్ని రేర్ వర్కింగ్ స్టిల్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
శ్రావణి పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..
