AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lenin: చేతులరా హిట్టు పోగొట్టుకున్న హీరోయిన్.. లెనిన్ సినిమాను రిజెక్ట్ చేసిన ముద్దుగుమ్మ ఎవరంటే..

Lenin: అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘భారతి’ పాత్రలో ఆమె ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంతో భాగ్యశ్రీ కెరీర్‌లో తొలి భారీ కమర్షియల్ హిట్ నమోదై, టాలీవుడ్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Lenin: చేతులరా హిట్టు పోగొట్టుకున్న హీరోయిన్.. లెనిన్ సినిమాను రిజెక్ట్ చేసిన ముద్దుగుమ్మ ఎవరంటే..
Lenin Movie Heroin
Phani CH
|

Updated on: Jul 11, 2026 | 7:48 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలిడ్ కమర్షియల్ సక్సెస్ ‘లెనిన్’ సినిమాతో ఎట్టకేలకు లభించింది. మొదటి ఆట నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటి రోజే దాదాపు 16 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయింది.

ఇది ఇలా ఉంటే సినిమా కాస్టింగ్ విషయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్ లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మొదట హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ శ్రీలీలను అనుకున్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో టాలీవుడ్ లేటెస్ట్ క్రష్, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేను లీడ్ హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ వేళ సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ శ్రీలీలపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది.

గతంలో ఆమెతో కూడిన ఒక గ్లింప్స్ కూడా మేకర్స్ విడుదల చేశారు. అయితే అప్పట్లో ఆ గ్లింప్స్‌లో ఒక సీరియస్ సన్నివేశంలో శ్రీలీల నవ్వుతూ కనిపించిందని నెటిజన్లు పెదవి విరిచారు. ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్‌మెంట్ సమస్యల వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా, ఆ స్థానంలోకి టాలీవుడ్ లేటెస్ట్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. ఇప్పుడు సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ‘భారతి’ అనే ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. భాగ్యశ్రీ నటనకు వస్తున్న రెస్పాన్స్ చూసి మీమర్స్ మరియు నెటిజన్లు శ్రీలీలను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

శ్రీలీలను ఈ సినిమా నుండి తొలగించి మేకర్స్ చాలా మంచి పని చేశారని, ఒకవేళ ఆ పాత్రలో శ్రీలీల ఉండి ఉంటే ఇంతగా పర్ఫార్మెన్స్ ఇచ్చేది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శ్రీలీల ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు, క్యూట్ లుక్స్ మరియు డ్యాన్సులకే పరిమితమైందని, కేవలం ‘భగవంత్ కేసరి’ తప్ప ఆమెకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు పడలేదని విమర్శిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే మాత్రం ఎమోషనల్ మరియు రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టేసి తన కెరీర్‌లో మొదటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలోనే శ్రీలీల కంటే భాగ్యశ్రీనే ఈ చిత్రానికి బెస్ట్ ఛాయిస్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే
కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే
పాములా వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!
పాములా వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!